Massive Transfers of DSP's In Andhra Pradesh - Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా డీఎస్పీల బదిలీలు

Apr 26 2023 8:09 AM | Updated on Apr 26 2023 11:08 AM

Massive DSP Transfers In Andhra Pradesh - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా డీఎస్పీల బదిలీ జరిగింది. రాష్ట్రంలో సుమారు 77 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ.. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఈ ఉత్తర్వులను జారీ చేశారు. 

విశాఖకు సంబంధించి బదిలీ అయ్యిన వారిలో ..అనకాపల్లిలో ఏడీపీఓగా విధులు నిర్వర్తిస్తున్న సునీల్‌కి విశాఖ క్రైమ్‌ ఏసీపీగా బదిలీ, ఏసీబీ డీఎస్పీగా ఉన్న సుబ్బరాజుకి అనకాపల్లి ఎస్‌డీపీఓగా బదిలీ, కాశీబుగ్గలో ఎస్‌డీపీఓగా విధులు నిర్వహిస్తున్న శివరాం రెడ్డికి విశాఖ నార్త్‌ ఏసీపీగా, అలాగే హర్బర్‌ ఏసీపీగా పనిచేస్తున్న శిరీషకి నెల్లూరు జిల్లాకి బదిలీ అయ్యింది. ఈ మేరకు విశాఖ జిల్లాకు ట్రాన్స్‌ఫర్‌ అయిన అధికారులంతా నార్త్‌ విశాఖ హెడ్‌ క్వార్టర్స్‌లో ఉన్న ఏసీసీ శ్రీనివాసరావుకి రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. 

బదిలీల ఉత్తర్వుల కాపీ కోసం క్లిక్‌ చేయండి


(చదవండి: బాబు చీకటికి.. జగన్‌ వెలుగులకు ప్రతినిధి)

Advertisement
 
Advertisement
Advertisement