Palnadu Man Cheated And Taking Pension In The Name Of The Person Who Died 12 Years Ago - Sakshi
Sakshi News home page

మరణించిన వ్యక్తికి 12 ఏళ్లుగా వృధాప్య పెన్షన్‌..ఆరా తీస్తే..

Jun 6 2023 5:06 PM | Updated on Jun 6 2023 6:29 PM

Man Cheated Taking Pension In The Name Of 12 Years Ago Deceased  - Sakshi

పల్నాడు జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మరణించిన వ్యక్తికి 12 ఏళ్లుగా వృధ్యాప్య ఫించన్‌ ఇస్తున్నారంటూ విమర్శుల వెల్లువెత్తాయి. చాలా ఏళ్ల క్రితం తండ్రి చనిపోతే..అతడి పెన్షన్‌కి ఆశపడి ప్రభుత్వాని మోసం చేస్తున్న కొడుకు ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో ఈ ఘటన జరిగింది.

గ్రామానికి చెందిన చనిపోయని వ్యక్తి బతికున్నట్లు నమ్మించి 12 ఏళ్లుగా ఫించన్‌ తీసుకుంటున్నాడు మృతుడు పారా కిరీటి కుమారుడు సారయ్య. 2001లో చనిపోయిన తన తండ్రి స్థానంలో మరొక వ్యక్తిని చూపిస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ పెన్షన్ అందుకుంటున్నట్లు మృతుడి బంధువులు జాయింట​ కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు. అతను 2011లో తన మామ చనిపోతే..అతడిని తండ్రిగా చూపించి నకిలీ డాక్యుమెంట్స్‌ సృష్టించి ఫించన్‌కు దరఖాస్తు చేస్తే అధికారులు ఫించన్‌ మంజూరు చేసేశారు.

దీంతో అతడు ధర్జాగా గత 144 నెలలుగా మోసం చేస్తూ సుమారుగా 4 లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్మును  పారా సౌరయ్య కాజేసినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టాలని డీడీవో మహాలక్ష్మిని జేసీ శ్యాంప్రసాద్‌ ఆదేశించారు. ఇన్నేళ్లుగా పింఛన్ తీసుకుంటున్నా అధికారులకు మాత్రం దొరకలేదు.

(చదవండి: సత్తా చాటిన గుంటూరు జిల్లా ఎడ్లు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement