Live Updates
రెండేళ్ల వెన్నుపోటు పాలనపై రాష్ట్రవ్యాప్త నిరసనలు
చిత్తూరు జిల్లా:
- జీడి నెల్లూరు నియోజకవర్గంలో కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
- చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పాలనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఇచ్చిన నిరసన ర్యాలీకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలు
- కూటమిప్రభుత్వం వెన్ను పోటు పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు: కృపాలక్ష్మీ
- చంద్రబాబు నాయుడు రెండేళ్ల వెన్నుపోటు పాలనలో ప్రజలు అందరికీ వెన్ను పోటు పొడిచారు
- ప్రజలు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం అమలు చేయలేదు
- ఇచ్చిన హామీలుపైన ఏరోజైనా సిఎం చంద్రబాబు నాయుడు నోరు విప్పారా..?
- రెండేళ్ల పాలనలో మహిళలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారని, మహిళలకు భద్రత గాలిలో దీపంగా మారింది
చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం దగ్గర్లోనే ఉంది
తిరుపతి జిల్లా:
- బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం భారీ ర్యాలీ
- సత్యవేడు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నూక తోట రాజేష్ ఆధ్వర్యంలో ర్యాలీ
- ఎలక్షన్ సమయంలో అమలు చేయలేని హామీలతో నమ్మించి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు ఇటు మహిళలను అటు నిరుద్యోగులను రైతులను నట్టేట ముంచారు.
- చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
తునిలో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన ర్యాలీ
- అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు: దాడిశెట్టి రాజా
- రెండేళ్ల పాలనలో ప్రజలకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరలేదు
- మహిళలు, రైతులు, యువతలో అసంతృప్తి పెరిగింది
- అధికారంలోకి వస్తే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి యువతను మోసం చేశారు
- అమరావతి పేరుతో భారీగా అప్పులు చేసి నిధులు దుర్వినియోగం చేస్తున్నారు
- రాష్ట్ర అప్పులపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలి
- రాష్ట్ర ఆదాయం, వ్యయాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి
- రెడ్‌బుక్ పేరుతో ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు
- 2029లో మళ్లీ వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది.
రెండేళ్లకే కూటమీ ప్రభుత్వం పని అయిపోయింది
ప్రకాశం జిల్లా
చంద్రబాబుపై దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డీ ఫైర్
రెండేళ్లకే కూటమీ ప్రభుత్వం పని అయిపోయింది..
జనం చీదరించుకుంటున్నారు... ప్రభుత్వం తీరు మార్చుకొకపోతే త్వరలో జనం తిరగబడతారు..
చంద్రబాబు అంత ఊసరవెళ్లి ప్రపంచంలో లేడు
మోడీ ని నరహంతకుడు అన్న నోటితోటే...చంద్రబాబు నేడు మోడీ జపం చేస్తున్నాడు..
అమరావతి పేరు తో చంద్రబాబు దోపిడీ చేస్తున్నారు..
తాను తన కొడుకు బాగుకోసమే చంద్రబాబు పాలన అన్నట్టు చంద్రబాబు తీరు
చెప్పిన ఒక్క పధకమైన సక్రమంగా అమలు చేసావా బాబూ..?
నిరుద్యోగ భృతి ఎక్కడ , ఆడబిడ్డ నిధి ఎక్కడ?...
డియస్సి పేరుతో నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన చరిత్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ది
విధ్వంసకర కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి : పేర్ని కిట్టు
మచిలీపట్నం :
పేర్ని కిట్టు
- బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి కాలం చెల్లింది
- కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు
- సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ కూటమి ప్రభుత్వం ప్రజలను వంచన చేసే ప్రయత్నాలను మానుకోవాలి
- అభివృద్ధి పేరిట దోచుకుని దాచుకోవడం తప్ప కూటమి ప్రభుత్వంతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు
- మెగా డీఎస్సీ పేరుతో ఉద్యోగాలను అమ్ముకున్న నీచ చరిత్ర కూటమి ప్రభుత్వానిది
- అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న పెన్షన్ల మంజూరు..ఇళ్ల స్థలాల కేటాయింపు...వికలాంగుల పింఛన్లు ఒకటైన నెరవేర్చారా
- రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే నోరు మెదపని హోమ్ మినిస్టర్ విద్యా శాఖ మంత్రి లోకేష్ పై ఆరోపణలు వస్తే మాత్రం బయటికి వచ్చి మాట్లాడడం సిగ్గుచేటు
- రాష్ట్రంలోని మంత్రులు వారి శాఖలను వదిలిపెట్టి వేరే శాఖలపై జోక్యం చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడపడం దారుణం.
- గత రెండు సంవత్సరాల పాలనలో వైసీపీ శ్రేణులను వేధించడం అక్రమ కేసులు బనాయించి హింసించడం తప్ప కూటమి ప్రభుత్వం చేసింది ఏమిటి
- కూటమి ప్రభుత్వ బెదిరింపులకు ఏ ఒక్క వైసీపీ కార్యకర్త బెదరుడు అదరుడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి
- విధ్వంసకర కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి
- వైఎస్ఆర్సిపి అధికారంలోకి తీసుకు వచ్చి ముఖ్యమంత్రిగా జగనన్నను నిలిపే విధంగా వైసీపీ శ్రేణులు చివర రక్తం బొట్టు వరకు శ్రమిస్తారు.
- వైసీపీ కార్యకర్తలకు అండదండగా నిలబడతాం
వైఎస్ జగన్ సీఎం అవ్వడం ఖాయం : జోగి
మాజీ మంత్రి,జోగి రమేష్
- దొంగహమీలతో ఓటేసిన ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు
- రైతాంగాన్ని నిట్టనిలువుగా ముంచేశాడు
- మొక్కజొన్నకు 1500 గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయాడు
- జగన్ హయాంలో ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకున్నారు
- చంద్రబాబు ప్రజలకు రంజాన్,సంక్రాంతి,దసరా ఏ పండుగా లేకపోయింది
- పదే పదే చంద్రబాబు వైఎస్సార్‌సీపీ గొడ్డలి పార్టీ అంటున్నాడు
- మాది గొడ్డలి పార్టీ కాదు చంద్రబాబు
- విలువలు,విశ్వసనీయతతో పుట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ
- దమ్మున్న నాయకుడున్న పార్టీ వైఎస్సార్‌సీపీ
- చంద్రబాబుది వెన్నుపోటు పార్టీ
- ఒక్కడిని ఎదుర్కోలేక ముగ్గురు కలిసి పోటీచేశారు
- చంద్రబాబు,పవన్ ,బీజేపీ కలిసి వచ్చినా ఈసారి వార్ వన్ సైడే
- రాబోయేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే .. వైఎస్ జగన్ సీఎం అవ్వడం ఖాయం
- 83 రోజులు జైల్లో పెడితే నేను తగ్గుతా అనుకున్నావా చంద్రబాబు
- జైల్లో నుంచి బయటికి వచ్చిన రోజే చెప్పా..నీ తాట తీస్తా చంద్రబాబు
- ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మళ్లీ నీ ఇంటికొస్తా
- నీ ఇంటి గేటు దగ్గరే నిరసన చేస్తా
- నీ గూండాలతో నా ఇంటి పై దాడి చేయించావ్
- దాడులు, అరెస్ట్ లతో నన్ను భయపెట్టలేవ్
- నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు కూడా అంతే దూరం
- మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కాదు పావలా ప్రసాద్
- నీకు,నీ బావమరిదికీ అన్నింటిలో పావలా వాటా కావాలి
- వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి నేను పోటీచేస్తా
- నువ్వు నా మీద పోటీచేస్తావా చెప్పు పావలా ప్రసాద్
- చంద్రబాబు,లోకేష్‌ను ఒప్పించు నువ్వు మైలవరం నుంచే పోటీచేస్తానని
- నందిగామ నుంచి వచ్చిన నీకు బీఫామ్ ఇచ్చి సీటు ఇప్పిస్తే
- వైఎస్సార్‌సీపీ కార్యకర్తల పై కేసులు పెట్టించావ్
- సూటుకేసులు మోసి టిడిపిలో సీటు కొనుకున్నావ్
- ఇప్పుడు టిడిపి కార్యకర్తలపై కేసులు పెట్టిస్తున్నాడు
- వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పావలా ప్రసాద్‌కు సీటిస్తే టీడీపీ కార్యకర్తలంతా వైఎస్సార్‌సీపీకే ఓటేయండి
కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి : బుగ్గన
నంద్యాల జిల్లా
- డోన్ లో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని చేపట్టిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి
- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న హామీలను అమలు చేయలేదని మండిపాటు.
- కార్యక్రమం లో పెద్ద ఎత్తున పాల్గొన్న పార్టీ నాయకులు కార్యకర్తలు.
- ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించిన బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి
ఉడత ఊపులకు బయపడే వారు వైఎస్సార్‌సీపీలో లేరు : కురసాల
కాకినాడ జిల్లా :
- కాకినాడ రూరల్ లో వెన్నుపోటు కు రెండేళ్ళు నిరసన ర్యాలీ
- రూరల్ పార్టీ క్యాంపు కార్యాలయం నుండి సర్పవరం జంక్షన్ వరకు భారీ బైక్ ర్యాలీ
- పాల్గోన్న ఉమ్మడి విశాఖ,విజయనగరం జిల్లాల రిజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు.
కురసాల కన్నబాబు కామెంట్స్
- వైఎస్ జగన్ ను ఓడించేందుకు కూటమీ కట్టి అలవీకానీ హమీలతో ప్రజలను మోసం చేశారు.
- ఇచ్చిన హమీలు నిలబెట్టుకునే ఆలోచన.. శక్తి చంద్రబాబుకు లేదు
- ఈ రెండేళ్ళ కాలంలో ఇచ్చిన హమీలను సంపూర్ణంగా అమలు చేయలేదు
- ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, యాభై ఏళ్ళకు ఫించన్ అమలు చేశారా?
- అమ్మకు వందనం లబ్ధిదారులను కుదించేశారు.
- ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారు
- రాష్ట్రంలో చాల దుర్మార్గమైన పాలన జరుగుతోంది.
- డిఎస్సీ పోస్టులను అమ్ముకున్న మిమ్మల్ని నిలదీయకపోతే మా పార్టీ కి అర్ధమే లేదు.
- మీకు కేసులకు..ఊడత ఊపులకు బయపడే వారు వైఎస్సార్‌సీపీలో లేరు
చంద్రబాబును రాష్ట్రం నుంచి సాగనంపుతాం
తిరుపతి జిల్లా :
కూటమీ ప్రభుత్వ వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా చంద్రగిరిలో వైఎస్సార్‌స్సీపీ నాయకులు భారీ నిరసన
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, చల్ల రాజశేఖర్ రెడ్డి
కూటమి ప్రభుత్వ మేనిఫెస్టో పత్రాలను దగ్ధం చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు
అనంతరం భారీ ర్యాలీ నిర్వహించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నావు చంద్రబాబు : చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చావా, మహిళలకు ఆడబిడ్డ నిధి ఇచ్చారా, ఏ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేశారని సంబరాలు
మోసాలకు, దాడులకు, భూ కబ్జాలకు కేరాఫ్‌గా కూటమి ప్రభుత్వం
కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ప్రతి కార్యకర్త పోరాడాలి
చంద్రబాబును రాష్ట్రం నుంచి సాగనంపి, జగనన్నకు పట్టాభిషేకం కట్టే వరకు కష్టపడతాం
చంద్రబాబు ప్రపంచ మోసగాడు : అంబటి
గుంటూరు:
గుంటూరులో మాజీ మంత్రి రాంబాబు ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం
లాడ్జి సెంటర్లో అంబటి రాంబాబుని అడ్డుకున్న పోలీసులు
పోలీసులకు అంబటి రాంబాబుకు మధ్య వాగ్వాదం
అంబటి రాంబాబు కామెంట్స్
కూటమీ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయింది
ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు.
సూపర్ సిక్స్ లో ముఖ్యమైనవి అసలు అమలు చేయలేదు.
స్త్రీ నిధి ఇవ్వలేదు
ప్రధాన వాగ్దానాన్ని వదిలేశారు
నిరుద్యోగి భృతి ఇవ్వలేదు
యువగళం గాలికి పోయింది
యాభై ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు పెన్షన్ అన్నారు
ముగ్గురు మోసగాళ్ళ ప్రభుత్వం ఇది
చంద్రబాబు ప్రపంచ మోసగాడు
లోకేష్ ఆల్ ఇండియా మోసగాడు
పవన్ కల్యాణ్ ఆంధ్రా మోసగాడు.
కూటమీ పని గోవిందా గోవిందా
డిఎస్సీపై మాట్లాడటం లేదు.
లోకేష్ డిఎస్సీలో ఉద్యోగాలకు డబ్బులు తీసుకున్నాడు
చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుంటే డీఎస్పీ అడ్డుకున్నారు
తెలుగుదేశం నాయకులు జగన్ దిష్టి బొమ్మ తగులపెడితే పోలీసులు రక్షణ కల్పిస్తారు.
గుంటూరు పోలీసులకు ఏం పోయేకాలం
రాబోయేది జగన్ పాలనే
వచ్చే నెల 29 తేదిన వినతి పాదయాత్ర చేస్తాను
వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే అభివృద్ధి, సంక్షేమం
నెల్లూరు జిల్లా:
- సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరులో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి రాజశేఖర్ రెడ్డి బొమ్మ వరకు వైఎస్ భారీ ర్యాలీ
చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైఎస్ ఆర్ సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ పూజిత
కాకాణి కామెంట్స్..
- చంద్రబాబు అధికారం లోకి వచ్చి రెండేళ్లు పూర్తి అవుతున్నా ప్రజలకు చేసింది సూన్యం..
- ఎన్నికలకు ముందు ఇస్తానన్న ఒక్క హామీ కూడా పూర్తి స్థాయి లో ఇవ్వలేదు
- చంద్రబాబుకి ఓటు వేసి మోసపోయామని ప్రజలు ఈ రోజు బాధ పడుతున్నారు
- ఈరోజు అధికారం ఉందని ఎగిరెగిరి పడుతున్న వాళ్ళందరూ రేపు ఒక రోజు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది
- వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే అభివృద్ధి, సంక్షేమం
- చంద్రబాబు ఏ ముఖం పెట్టుకొని తిరుపతిలో ఈరోజు సభ నిర్వహిస్తున్నాడు
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి : ఎమ్మెల్సీ భరత్
చిత్తూరు జిల్లా
కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన ర్యాలీ..
ర్యాలీలో పెద్దసంఖ్యలో పాల్గొన్న వైసీపీ నేతలు, కార్యకర్తలు..
ఎమ్మెల్సీ భరత్ కార్యాలయం నుండి బస్టాండ్ కూడలిలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు భారీ ర్యాలీ..
వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన వైసీపీ నేతలు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వైసిపి నేతలు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్..
మోసం, మాయ చేసి పాలన చేసి వెన్నుపోటు పొడిచారు : బొత్స
విజయనగరం జిల్లా
శాసనమండలి ప్రతి పక్ష నేత బొత్స సత్యనారాయణ పాయింట్స్
ఏం చేసారని తిరుపతిలో కూటమి ప్రభుత్వం సభ పెట్టింది
యూరియాకు కార్డులు ఇవ్వడం తప్ప యూరియా లేదు
గ్రామాల్లో స్కూల్స్ వైఎస్సార్సీపీ సుందరంగా తీర్చి దిద్దింది. టీడీపీ వచ్చి కకావికలం చేసింది.
ఒక్క క్షణం కూడా ఈ ప్రభుత్వం కొనసాగడానికి వీలు లేదు
కొత్త వారికి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వడం లేదు
పేద వారికి, మహిళలకు, విద్యార్థులు, నిరుద్యోగులకు మోసం చేశారు..
వైఎస్సార్సీపీ పాలనలో ప్రజల ఆదాయం ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా వుంది..
మోసం, మాయ చేసి పాలన చేసి వెన్నుపోటు పొడిచారు..
వెన్నుపోటు పార్టీని ఊర్లలోకి రానీయొద్దు.
వెన్నుపోటు పాలనపై గాడిదెలతో నిరసన
నంద్యాల జిల్లా
- వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన వెన్నుపోటు పై భారీ నిరసన ర్యాలీని ఎద్దుల బండి , గాడిదెలతో నిరసన
- నంద్యాల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి శ్రీనివాస్ సెంటర్ వరకు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం నిర్వహించారు
- భారీ ఎత్తున పాల్గొని కూటమి ప్రభుత్వం కు వేతిరేకంగా నినదించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నాయకులు కార్యకర్తలు
- కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి , ఎమ్మెల్సీ ఇస్సాక్ బాష , మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి , వైసిపి నేతలు
పేర్ని కిట్టు ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం
కృష్ణాజిల్లా మచిలీపట్నం
మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త పేర్ని కిట్టు ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం
లక్ష్మీ టాకీస్ సెంటర్ నుండి జిల్లా కోర్టు వైయస్సార్ విగ్రహం వరకు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్ఆర్సిపి శ్రేణులు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించిన నియోజకవర్గ ఇన్చార్జి పేర్ని కిట్టు
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా నల్ల బెలూన్లను ఎగురవేసి నిరసనను తెలిపిన వైఎస్ఆర్ సీపీ శ్రేణులు
వందలాదిగా తరలివచ్చిన వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు

అనకాపల్లిలో వెన్నుపోటు పాలనకు రెండేళ్ల నిరసన
అనకాపల్లి..
- మాడుగుల నియోజకవర్గంలో ప్రారంభమైన చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్ల నిరసన కార్యక్రమం.
- నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఈర్లే అనురాధ.
- నిరసన కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరైన వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు, ప్రజలు.
విజయవాడలో కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణుల నిరసన
విజయవాడ
- వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమం
- విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం..
- ఎమ్ హోటల్ నుండి బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ..
- నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, స్టేట్ సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు అంజిరెడ్డి..
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసనలో కొడాలి నాని
కృష్ణాజిల్లా
- గుడివాడలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన ప్రదర్శన
- పాల్గొన్న మాజీ మంత్రి కొడాలి నాని , వైఎస్సార్‌సీపీ నేతలు , కార్యకర్తలు
నిరసనలో పోటెత్తిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
విశాఖ :
- చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా విశాఖ నార్త్ నియోజకవర్గంలో భారీ నిరసన..
- మహారాణి పార్లర్ జంక్షన్ నుంచి అక్కయ్యపాలెం హైవే వరకూ ర్యాలీ
- కేకే రాజు ఆధ్వర్యంలో భారీగా తరలి వచ్చిన వైసీపీ శ్రేణులు
నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో భారీ నిరసన
ఎన్టీఆర్ జిల్లా:
- తిరువూరు నియోజకవర్గ స్థాయిలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్
- ఫ్యాక్టరీ సెంటర్ నుండి బోసుబొమ్మ, మున్సిపల్ ఆఫీస్ మీదుగా తహసిల్దార్ కార్యాలయం వరకు చేపట్టిన నిరసన ర్యాలీ.
- పాల్గొన్న నాలుగు మండలాల పార్టీ నేతలు,కార్యకర్తలు
వైఎస్సార్‌సీపీ నిరసనలో పోలీసుల అత్యుత్సాహం
పల్నాడు జిల్లా
- ఇవాళ అమరావతిలో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం
- అమరావతికి భారీ స్థాయిలో పెద్దకూరపాడు నియోజకవర్గ నుంచి తరలివస్తున్న పార్టీ శ్రేణులు
- అమరావతికి వస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు
- బయ్యవరం అడ్డరోడ్డు, కోనూరు అడ్డరోడ్డు వద్ద రోడ్డుపై పోలీసుల గస్తీ
- అమరావతిలోని చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం పాల్గొనడానికి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తల పేర్లు రాసుకుంటున్న పోలీసులు
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో స్టాల్స్ ప్రదర్శన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
- రెండేళ్ల కూటమి వెన్నుపోటు పాలనను నిరసిస్తూ రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
- అన్ని వర్గాలను ఓటమి ప్రభుత్వం మోసం చేస్తుందంటూ స్టాల్స్ ప్రదర్శన
- భారీగా తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
- ప్రజా వ్యతిరేక పాలన నిరసిస్తూ స్టాల్స్ ప్రదర్శన
పులివెందులలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల భారీ ఆందోళన
- వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా పులివెందులలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల భారీ ఆందోళన
- వైఎస్ జయమ్మ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ ప్రారంభించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిరసన
- వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ వైయస్ఆర్సీపీ నిరసన కార్యక్రమం
- విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిరసన
- నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు
భూమన నేతృత్వంలో భారీ ర్యాలీ
- చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లుపై వైఎస్సార్‌సీపీ వ్యాప్త నిరసన ర్యాలీ
- ఇచ్చిన హామీలు అమలుచేయక పోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు
- తిరుపతి,చిత్తూరు జిల్లాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ
- తిరుపతిలో వేలాదిగా తరలి వచ్చిన వైఎస్సార్‌సీపీ పార్టీ నాయకులు ,కార్యకర్తలు
- చంద్రబాబు వెన్నుపోటు రెండేళ్ల పాలనలో అక్కచెల్లెమ్మలకు వెన్నుపోటు
- తిరుపతి గ్రూప్ థియేటర్ సర్కిల్ నుంచి తుడా వైఎస్ఆర్ సర్కిల్ వరకు కొనసాగనున్న ర్యాలీ
కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్
- తాడిపత్రిలో ఉద్రిక్తత
- తాడిపత్రి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్
- మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నేడు చంద్రబాబు వెన్నుపోటు కు రెండేళ్లు కార్యక్రమం
- పెద్దా రెడ్డి కి పోటీగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బైక్ ర్యాలీ
- నిరసన ప్రదర్శన కు హాజరయ్యేందుకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని అడ్డుకున్న పోలీసులు
- పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం
- జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో తనను అడ్డుకుంటున్నారని ఫైర్
- తాడిపత్రి నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పర్యటనలకు ఇప్పటికే హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- హైకోర్టు ఆదేశాలు ఉన్నా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని పోలీసులు అడ్డుకోవడంపై సర్వత్రా విమర్శలు
చంద్రబాబు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’
- నేడు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు
- చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిరసన ర్యాలీలు
- అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ కార్యక్రమాలు
- ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై ప్రజల్లో ఆగ్రహం
- అన్ని వర్గాలనూ మోసం చేసిన చంద్రబాబు సర్కార్
- సూపర్ సిక్స్ సహా 143 హామీలకు మంగళం
- హామీలు అమలు చేయాలంటూ ఇప్పటికే మండల కేంద్రాల్లో మేనిఫెస్టోలు దగ్ధం
- నియోజకవర్గాలలో జరిగిన టౌన్ హాల్ సదస్సులు
- నేడు భారీగా నిరసన ర్యాలీలకు వైఎస్సార్‌సీపీ పిలుపు


