సాక్షి, శ్రీశైలం: ఏపీలో మోంథా తుపాను కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. మరోవైపు.. ఎడతెరిపిలేని వర్షాలతో శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడిన భారీ కొండచరియలు పడ్డాయి. దీంతో, బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మోంథా తుపాను ప్రభావంతో శ్రీశైలంలో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా డ్యామ్ ఘాట్ రోడ్డుపై భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో, హైదరాబాద్-శ్రీశైలం బస్సుల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు జేసీబీ సాయంతో వాటిని తొలగిస్తున్నారు. లింగాలగట్టు చెక్ పోస్ట్ వద్ద వాగు ఉప్పొంగి ప్రవహించడంతో భవనం కోతకు గురైంది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.
Andhra Pradesh
Cyclone Montha hits Srisailam, Nandyal District. Landslides on Patalaganga steps destroy 3 shops. Continuous rain halts normal life, devotees confined to shelters. Floodwaters erode roads, locals fear further damage. #CycloneMontha #Srisailam #Nandyal pic.twitter.com/Ar2EKsXEeH— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) October 29, 2025
ఇదిలా ఉండగా.. పాతాళగంగ (Paathal Ganga)కు వెళ్లే దారిలో కొండచరియలు విరిగిపడ్డియాయి. ఈ దుర్ఘటనలో మొత్తం మూడు షాపులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు భక్తులను అటువైపు వెళ్లేందుకు అనుమతించడం లేదు. పుష్కరిణికి వెళ్లే మార్గం పూర్తిగా శిథిలాలతో మూసుకుపోగా పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు టూరిజం శాఖ ఆధ్వర్యలోని రోప్ వే (Rope Way) సర్వీసును కూడా తాత్కాలికంగా మూసివేశారు.
తుపాను ప్రభావంతో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు నగరం సహా కొత్తపల్లి, మహానంది, ఆత్మకూరు మండలాల్లో ఎడతెరిపి లేకుండా ముసురు పడుతోంది. మహానంది మండలం నందిపల్లి వద్ద పాలేరు వాగు వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. కొత్తపల్లి మండలంలో శివపురం పెద్దవాగు పొంగిపోర్లుతుండటంతో సమారు 11 గ్రామాల రాకపోకలకు అంతరాయం తీవ్ర అంతరాయం ఏర్పడింది.


