నెలాఖరుకల్లా శ్రీశైలానికి కృష్ణమ్మ! | Krishna River Water To Srisailam By The End Of June | Sakshi
Sakshi News home page

నెలాఖరుకల్లా శ్రీశైలానికి కృష్ణమ్మ!

Jun 23 2021 5:47 AM | Updated on Jun 23 2021 5:47 AM

Krishna River Water To Srisailam By The End Of June - Sakshi

సాక్షి, అమరావతి: పశ్చిమ కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా నదిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. గతేడాది కంటే ఈ ఏడాది ఎగువన ప్రాజెక్టులు ముందే నిండే అవకాశముండటంతో.. ఈ నెలాఖరుకల్లా శ్రీశైలానికి వరద ప్రవాహం చేరే అవకాశముందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. మంగళవారం ఆల్మట్టి జలాశయంలోకి 1.55 లక్షల క్యూసెక్కులు వచ్చి చేరాయి. దీంతో నీటి నిల్వ 85.68 టీఎంసీలకు పెరిగింది. నారాయణపూర్‌ జలాశయంలో నీటి నిల్వ 25 టీఎంసీలకు చేరుకుంది. ఈ రెండు జలాశయాలు నిండటానికి 56 టీఎంసీలు అవసరం.

వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో 4 రోజుల్లో ఆ ప్రాజెక్టులు నిండుతాయి. అప్పుడు ఆ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తారు. ఈ వరద ప్రవాహం జూరాల మీదుగా నెలాఖరుకల్లా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరే అవకాశముందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు తుంగభద్రలో వరద ప్రవాహం కాస్త తగ్గింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 36 వేల క్యూసెక్కులు వచ్చి చేరడంతో.. నీటి నిల్వ 25 టీఎంసీలకు చేరుకుంది. ఈ డ్యామ్‌ నిండాలంటే ఇంకా 75 టీఎంసీలు అవసరం. బీమా నదిలో వరద ప్రవాహం ప్రారంభమైంది. ఉజ్జయిని ప్రాజెక్టులోకి 5,611 క్యూసెక్కులు వచ్చి చేరడంతో.. నీటి నిల్వ 56.71 టీఎంసీలకు పెరిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement