
సుప్రీం సీజే జస్టిస్ బీఆర్ గవాయ్ కొలీజియం సిఫారసు.. ప్రస్తుతం గుజరాత్, అలహాబాద్ హైకోర్టులలో విధులు
కలకత్తా హైకోర్టు నుంచి ఏపీకి జస్టిస్ సుబేందు సమంత.. రాష్ట్ర హైకోర్టులో
33కి చేరనున్న న్యాయమూర్తుల సంఖ్య
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టు నుంచి గతంలో బదిలీపై వెళ్లిన న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ దొనడి రమేష్లు తిరిగి రానున్నారు. జస్టిస్ రాయ్ ప్రస్తుతం గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా, జస్టిస్ రమేష్ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. వీరిద్దరిని మళ్లీ ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం సోమవారం తీర్మానం చేసింది.
ఇదే సమయంలో.. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుబేందు సమంతను ఏపీ హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసులు పంపింది. దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులకు చెందిన 14 మంది న్యాయమూర్తులను బదిలీ చేస్తూ కొలీజియం తీర్మానం చేసింది. ఈ ప్రతిపాదనలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత వారు ఆయా హైకోర్టుల్లో ప్రమాణం చేస్తారు.
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా వచ్చిన అనంతరం జస్టిస్ మానవేంద్రనాథ్ మూడో స్థానంలో కొనసాగుతారు. హైకోర్టు కొలీజియంలో సభ్యుడిగా ఉంటారు. జస్టిస్ రమేష్ 6వ స్థానంలో, జస్టిస్ సుబేందు సుమంత 29 స్థానంలో ఉంటారు. ఈ ముగ్గురి నియామకంతో రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కి చేరనుంది.
పశ్చిమ బెంగాల్ నుంచి ఏపీకి...
జస్టిస్ సుబేందు సమంత 1971 నవంబరు 25న జని్మంచారు. పశ్చిమబెంగాల్ హమిల్టోన్‌లో పాఠశాల, తమ్లుక్‌లో హైసూ్కల్ విద్య పూర్తి చేశారు. కోల్‌కతా విశ్వ విద్యాలయం నుంచి లా డిగ్రీ పొందారు. తమ్లుక్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా ఎంపికయ్యారు.
కోల్‌కతాలో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయాధికారిగా, అండమాన్ నికోబార్‌లో జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేశారు. కోల్‌కతా సిటీ సెషన్స్ కోర్టు చీఫ్ జడ్జిగా వ్యవహరించారు. 2022 మే 18న కలకత్తా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, ఈ ఏడాది ఏప్రిల్ 28న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
మన్యం ప్రాంతం నుంచి...
జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ స్వస్థలం పార్వతీపురం. 1964 మే 21న విశాఖపట్నంలో జని్మంచారు. తల్లి విజయలక్షి్మ, తండ్రి నరహరిరావు. వీరిది వ్యవసాయ కుటుంబం. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ప్రాథమిక విద్య పార్వతీపురం ఆర్‌సీఎం పాఠశాలలో, ఉన్నత విద్య విశాఖపట్నం సెయింట్ అలోసియస్ హైసూ్కల్‌లో అభ్యసించారు. విశాఖపట్నం ఎంవీపీ లా కాలేజీలో న్యాయ విద్య చదివారు. 1988 జూలైలో ఏపీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1988 నుంచి 14 ఏళ్లపాటు పార్వతీపురం, విజయనగరంలో ప్రాక్టీస్ చేశారు. 2002లో డి్రస్టిక్ట్స్ అండ్ సెషన్స్ జడ్జిగా ఎంపికయ్యారు.
ఉమ్మడి ఏపీలో పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. 2015 జూలై 3 నుంచి 2018 డిసెంబరు 31 వరకు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు రిజి్రస్టార్ జనరల్‌గా సేవలందించారు. 2019 జనవరి 1న అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటయ్యాక తొలి రిజి్రస్టార్ జనరల్‌గా పనిచేశారు. 2019 జూన్ 20న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్‌కు క్రీడలపై ముఖ్యంగా క్రికెట్‌పై ఆసక్తి ఎక్కువ. భార్య లక్ష్మీ, కుమార్తెలు అనిషానాయుడు, రేష్మా సాయి ఉన్నారు. 2023లో గుజరాత్ హైకోర్టుకు బదిలీపై వెళ్లారు. జస్టిస్ మానవేంద్ర రాయ్ తాత చీకటి పరశురాం నాయుడు ప్రసిద్ధ న్యాయవాది, రాజనీతిజు్ఞలు. రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు.
మదనపల్లె నుంచి ఎదిగి...
జస్టిస్ దొనడి రమేష్ చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపాన కమ్మపల్లి గ్రామంలో 1965 జూన్ 27న జన్మించారు. తండ్రి డీవీ నారాయణ నాయుడు పంచాయతీరాజ్ శాఖలో ఇంజనీర్‌గా పనిచేశారు. తల్లి అన్నపూర్ణమ్మ. జస్టిస్ రమేష్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. 1987–90 మధ్య వీఆర్ లా కాలేజీ నుంచి న్యాయవాద డిగ్రీ పొందారు. 1990లో ఏపీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదయ్యారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నారాయణ వద్ద వృత్తి నైపుణ్యం సాధించారు.
హైదరాబాద్‌లో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2000 డిసెంబరు నుంచి 2004 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించారు. 2007లో ఏపీ సర్వ శిక్ష అభియాన్‌కు న్యాయవాదిగా ఉన్నారు. 2014లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులై 2019 మే వరకు కొనసాగారు. 2020 జనవరి 13న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2023 జూలై 24న అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు.