Minister Jogi Ramesh Fires On Chandrababu Naidu Over Guntur Incident - Sakshi
Sakshi News home page

మరణాలన్నీ చంద్రబాబు చేసిన హత్యలే.. మంత్రి జోగి రమేష్‌ సీరియస్‌

Jan 2 2023 7:09 AM | Updated on Jan 2 2023 8:35 AM

Jogi Ramesh Sensational Comments On TDP Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయవాడ: గుంటూరులో టీడీపీ సభలో చోటుచేసుకున్న ప్రమాద ఘటనపై మంత్రి జోగి రమేష్‌ స్పందించారు. ఈ సందర్భంగా ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం, మంత్రి జోగి రమేష్‌.. చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా, ప్రమాదంపై మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు పేద ప్రజల ఉసురు తీస్తున్నాడు. నాలుగు రోజుల క్రితమే 8 మందిని బలితీసుకున్నాడు. మరోసారి సభ పేరుతో ముగ్గురిని పొట్టనపెట్టుకున్నాడు. డ్రోన్ షూటింగ్స్‌ కోసం సందుల్లో మీటింగ్‌లు పెడుతున్నాడు.  
జనం తన కోసం వస్తున్నారనే ఎత్తుగడలో జనాన్ని బలితీసుకుంటున్నాడు. కొత్త సంవత్సరం రోజున సంతోషంగా గడపాల్సిన వారికి విషాదాన్ని మిగిల్చాడు. 

ఈ మరణాలన్నీ చంద్రబాబు చేస్తున్న హత్యలే. చంద్రబాబును వెంటనే అరెస్ట్ చేయాలి. చంద్రబాబు మీటింగ్‌లకు ఎక్కడా పర్మిషన్లు ఇవ్వొద్దని డీజీపీని కోరుతున్నాను. 30 వేల మందికి టోకెన్లు పంచి.. మూడు వేల మందికి కూడా ఏర్పాట్లు చేయలేదు. చంద్రబాబు అధికార దాహానికి అమాయక జనం బలైపోతున్నారు. చంద్రబాబుని రాష్ట్రంలో తిరగనిస్తే మరింత మంది ప్రజల ప్రాణాలను బలితీసుకుంటాడు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement