స్టాక్‌ మార్కెట్‌ పేరిట వైద్యుడికి టోకరా | Guntur Doctor Duped of Rs 15 Crore in stock market investments Scam | Sakshi
Sakshi News home page

స్టాక్‌ మార్కెట్‌ పేరిట వైద్యుడికి టోకరా

May 25 2026 5:37 AM | Updated on May 25 2026 5:37 AM

Guntur Doctor Duped of Rs 15 Crore in stock market investments Scam

చిత్తూరు అర్బన్‌: స్టాక్‌ మార్కెట్‌ పేరిట పలువురిని బురిడీ కొట్టించిన కేసులో ఓ మహిళను కర్ణాటక పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అందించిన వివరాల మేరకు.. బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో దుర్గాప్రసాద్‌ అనే వ్యక్తి వైద్యుడిగా పని చేస్తున్నారు. చిత్తూరు నగరం కొంగారెడ్డి పల్లెలోని శ్రీనివాస నగర్‌కు చెందిన చైతన్య, అతని భార్య హైమావతి స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి భారీగా లాభాలు తీసుకొస్తామంటూ దుర్గా­ప్రసాద్‌ను నమ్మించారు. 

గతేడాది నుంచి పలు దఫా­లుగా దుర్గాప్రసాద్‌ నుంచి రూ.15 కోట్లు  తీసు­కు­న్నా­రు. భారీగా వడ్డీ చెల్లిస్తామని చెప్పి మోసం చేశారు. ఎంతకూ డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితుడు బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బెంగళూరు పోలీసులు చిత్తూరు వచ్చారు. ప్రధాన నిందితుడు చైతన్య పారిపోగా అతని భార్య హైమావతిని అదుపులోకి తీసుకొని బెంగళూరు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement