పరిశ్రమల స్థాపనపై దృష్టి పెట్టండి | Focus on establishing industries says Chandrababu | Sakshi
Sakshi News home page

పరిశ్రమల స్థాపనపై దృష్టి పెట్టండి

Published Fri, Mar 14 2025 5:12 AM | Last Updated on Fri, Mar 14 2025 5:12 AM

Focus on establishing industries says Chandrababu

పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో సీఎం ఆదేశం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులపై ఒప్పందం చేసు­కున్న పరిశ్రమలు వెంటనే స్థాపించేలా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆమో­దం తెలిపిన, ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టుల పురోగతిని నిత్యం పరిశీలించాలన్నారు. గురువారం సచివాల­యంలో పెట్టు­బడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. అధ్యక్షత వహించిన సీఎం చంద్రబాబు గత ఎస్‌ఐపీ­బీ సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టులు, వాటి పురోగ­తిపై సమీక్ష జరిపారు. 

పరిశ్రమలు, విద్యుత్, పర్యాటకం వంటి రంగాల్లో మొత్తం 10 సంస్థలు రూ.1,21,659 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకురాగా సమావేశం ఆమోదం తెలిపింది. తద్వారా 80,104 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగు­తాయని అధికారులు తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియో­జకవర్గంలో ఒక ఎంఎస్‌ఎఈ పార్క్‌ చొప్పున మొత్తం 175 ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. 

తొలివిడ­తగా జిల్లాకు ఒకటి చొప్పున 26 జిల్లాల్లో తక్షణం 26 ఎంఎస్‌ఎంఈ పార్కులు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ప్రతిపాదించిన రతన్‌టాటా ఇన్నోవేషన్‌ కేంద్రాలను నెల రోజుల్లో 5 సెంటర్లు నెలకొల్పాలని కోరారు. 

ఎస్‌ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టుల వివరాలివీ
1. ప్రీమియర్‌ ఎనర్జీస్‌ లిమిటెడ్‌: నాయుడుపేటలో రూ.1,742 కోట్ల పెట్టుబడులు, 2 వేల ఉద్యోగాలు.
2. దాల్మియా సిమెంట్స్‌: వైఎస్సార్‌ జిల్లాలో రూ.2,883 కోట్ల పెట్టుబడులు, 354 ఉద్యోగాలు.
3. లులూ గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌: విశాఖపట్నంలో రూ.1,500 కోట్ల పెట్టుబడులు.
4. సత్యవేడు రిజర్వ్‌ ఇన్‌ఫ్రాసిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌: శ్రీసిటీలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులు, 50 వేల ఉద్యోగాలు.
5. ఇండోసాల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: రూ.58,469 కోట్ల పెట్టుబడులు, 13,050 ఉద్యోగాలు. 
6. బాలాజీ యాక్షన్‌ బిల్డ్‌వెల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: రూ.1,175 కోట్లు, 1,500 ఉద్యోగాలు. 
7. ఏపీ ఎన్జీఈఎల్‌ హరిత్‌ అమ్రిత్‌ లిమిటెడ్‌: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో రూ.22 వేల కోట్ల పెట్టుబడులు, 8,300 ఉద్యోగాలు.
8. ఆస్తా గ్రీన్‌ ఎనర్జీ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌: అన్నమయ్య, కడప జిల్లాలు, రూ.8,240 కోట్లు, 4 వేల ఉద్యోగాలు.
9. మేఫెయిర్‌ బీచ్‌ రిసార్ట్స్, కన్వెన్షన్‌: రూ.400 కోట్ల పెట్టుబడులు, 750 ఉద్యోగాలు.
10. ఒబేరాయ్‌ విలాస్‌ రిసార్ట్‌: రూ.250 కోట్ల పెట్టుబడులు, 150 ఉద్యోగాలు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement