(ఫైల్‌ఫోటో)
అనకాపల్లి: జిల్లాలో మత్య్సకారులు నిరసన చేపట్టారు. ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరంలో చేపట్టారు మత్య్సకారులు. తమకు భరోసా కింద ఇస్తానన్న రూ. 20 వేలు పడలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. బోటులపై లైసెన్స్‌లు, పాస్‌బుక్‌లతో బొట్లపైనే నిలబడి నిరసన వ్యక్తం చేశారు.
సముద్రoలో చేపల వేట నిషేధం సమయంలో 20వేల రూపాయలు మత్స్యకారుల భరోసా ప్రకటించింది కూటమి ప్రభుత్వం. అయితే పాయకరావుపేట నియోజకవర్గంలో 1380 మంది మత్స్యకారులకు మత్స్యకార భరోసా పడలేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మత్స్యకారుల భరోసా 20వేల రూపాయలు వెయ్యాలంటూ డిమాండ్ చేశారు. కాని పక్షంలో తమ నిరసనను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


