
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
వివరాల ప్రకారం.. బుక్కరాయసముద్రంలో రఫీ కుటుంబం నివాసం ఉంటోంది. అయితే, ఏమైందో ఏమో తెలియదు కానీ.. రఫీ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. తన ఇద్దరు పిల్లలతో కలిసి స్థానికంగా ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో రఫీ(35), సోహైల్(6), ఇమ్రాన్(9) మృతిచెందారు. అయితే, భార్యపై అనుమానంతోనే పిల్లలతో కలిసి రఫీ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సమాచారం. కాగా, ఈ విషాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: టీడీపీ నేతల బరితెగింపు