ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. సింగర్ సూసైడ్! | Singer Mallika Rajput Found Hanged At Her Home In Sultanpur, Cops Enquiry On This - Sakshi
Sakshi News home page

Singer Mallika Rajput Death: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. గదిలో శవమై కనిపించిన సింగర్!

Published Wed, Feb 14 2024 2:02 PM

Singer Mallika Rajput Found Hanged at his Home Cops Enquiry On this - Sakshi

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ సింగర్  విజయ్ లక్ష్మి అలియాస్ మల్లికా రాజ్‌పుత్  అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తన ఇంట్లోనే శవమై కనిపించిందని పోలీసులు తెలిపారు. కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతాకుండ్ ప్రాంతంలోని ఆమె ఇంటి గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందని పోలీసులు వెల్లడించారు. అయితే రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు మల్లిక తల్లి సుమిత్రా సింగ్ తెలిపారు. ప్రాథమికంగా అనుమానాస్పద మృతిగా భావిస్తున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

ఆమె తల్లి సుమిత్రా మాట్లాడుతూ.. 'ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు. నేను నా గదిలో పడుకున్నా. చాలాసేపు తన గదిలో లైట్ వెలుగుతుండడంతో అనుమానం వచ్చి తలుపు తీసేందుకు యత్నించాను. ఎంతకు డోర్ తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా.. నా కూతురు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే నా భర్త, స్థానికులు కలిసి మల్లికను ఆసుపత్రికి తరలించాం. అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు'అంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆత్యహత్య? లేదా ఎవరీ పాత్ర అయినా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  

కాగా.. సింగర్‌గా కెరీర్ ప్రారంభించిన మల్లికా రాజ్‌పుత్‌.. నటిగా రాణిస్తున్నారు. బాలీవుడ్‌లోనూ మల్లిక సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. 35 ఏళ్లకే మల్లికా చనిపోవడంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Advertisement
 
Advertisement
 
Advertisement