బైక్‌ అంబులెన్సులు.. ఇంజనీరింగ్‌ విద్యార్థుల ప్రతిభ

Engineering Students Designed Bike Ambulance - Sakshi

బైక్‌ అంబులెన్సులకు రూపకల్పన

సచివాలయాలకు ఉచితంగా అందజేస్తామని ప్రకటన

గేట్స్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థుల ప్రతిభ

గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గేట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు బైక్‌ అంబులెన్సులను రూపొందించారు. అత్యవసర సమయాల్లో కరోనా రోగులకు ఉపయోగపడేలా వీటిని తయారు చేశారు. ఆక్సిజన్‌ సిలిండర్, వీల్‌ చైర్, ఎమర్జెన్సీ మెడికల్‌ కిట్‌ ఇందులో ఉంటాయి. పూణేకు చెందిన డసల్ట్‌ సిస్టమ్స్‌ కంపెనీ ప్రతినిధి సుహాస్‌ ప్రీతిపాల్‌ పర్యవేక్షణలో మెకానికల్‌ సెకండియర్‌ చదువుతున్న గుత్తికి చెందిన యశ్వంత్, ఎజాజ్‌ అహ్మద్‌ 45 రోజులు శ్రమించి బైక్‌ అంబులెన్సులను రూపొందించారు.

ఇప్పటిదాకా తయారైన పది బైక్‌ అంబులెన్సులను త్వరలోనే సచివాలయాలకు  ఉచితంగా అందజేస్తామని  గేట్స్‌ కాలేజీ ఎండీ గజ్జల రఘునాథ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఒక్కో అంబులెన్స్‌ తయారు చేయడానికి దాదాపు రూ.50 వేలు ఖర్చయ్యిందని, కరోనా రోగులకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతోనే వీటిని రూపొందించామని విద్యార్థులు యశ్వంత్, ఎజాజ్‌ అహ్మద్‌ చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top