క‌ర్నూలులో బంగారు నిక్షేపాల వెలికితీత

Drilling Work Started In Kurnool As Part Of Extraction Of Gold deposits - Sakshi

తుగ్గలి: బంగారు నిక్షేపాల వెలికితీతలో భాగంగా కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని పగిడిరాయి–జొన్నగిరి గ్రామాల మధ్య డ్రిల్లింగ్‌ పనులను మంగళవారం జియో మైసూర్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ప్రారంభించింది. తుగ్గలి మండలంలోని పగిడిరాయి, బొల్లవానిపల్లి, జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో 40 ఏళ్లుగా వివిధ కంపెనీలు సర్వేలు చేసి, బంగారం నిక్షేపాలున్నాయని గుర్తించాయి. దాదాపు 15 ఏళ్లుగా సర్వే చేస్తున్న జియో మైసూర్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ నిక్షేపాల వెలికితీతకు సిద్ధమై.. 2013లోనే ప్రభుత్వ అనుమతులు పొందింది.

నిక్షేపాల వెలికితీతపై కొందరు కోర్టుకు వెళ్లడంతో పనుల్లో జాప్యమైంది. గతేడాది ఎకరా రూ.12 లక్షలు చొప్పున 300 ఎకరాలు కొనుగోలు చేసి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, భూములు కోల్పోయే రైతులకు డబ్బులు చెల్లించడంలో జాప్యం జరగడం, కొన్నాళ్ల పాటు కంపెనీ ప్రతినిధులు మొహం చాటేయడంతో మైనింగ్‌ ప్రాజెక్టు కలగా మిగిలింది. ఎట్టకేలకు రెండు రోజుల క్రితం కంపెనీ ప్రతినిధులు వచ్చి రైతులతో మాట్లాడి ఏడాది కౌలు చెల్లించి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. సోమవారం డ్రిల్లింగ్‌ పనులు మొదలు పెట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top