'దొడ్డి దారిన పదవి పొందిన దద్దమ్మవి నువ్వు' | Dharmana Krishna Das Praises CM Jagan In kakinada | Sakshi
Sakshi News home page

'దొడ్డి దారిన పదవి అనుభవించిన దద్దమ్మవి నువ్వు'

Nov 3 2020 5:38 PM | Updated on Nov 3 2020 8:29 PM

Dharmana Krishna Das Praises CM Jagan In kakinada - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమర్థవంతంగా పాలన చేస్తున్నారని జిల్లా ఇంచార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. కాకినాడలోని సూర్యకళా మందిరంలో జిల్లా నుంచి ఎన్నికైన బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌లు, డైరెక్టర్‌లకు మంగళవారం డిప్యూటీ సీఎం ధర్మాన చేతుల మీదుగా ఘన సన్మానం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రులు కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్‌, వేణుగోపాల కృష్ణ.. ఎంపీలు వంగా గీతా, గొట్టేటి మాధవి.. ఎమ్మెల్యే లు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి, సతీష్ కుమార్, ధనలక్ష్మి పాల్గొన్నారు. (దేవినేని ఉమకు షాకిచ్చిన జక్కంపూడి‌ గ్రామస్తులు‌)

ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. ఏడాదిన్నర పరిపాలనలోనే దేశంలోని సమర్ధవంతమైన ముఖ్యమంత్రుల్లో సీఎం వైఎస్‌ జగన్ మూడో స్థానాన్ని సంపాదించారు. రానున్న రోజుల్లో సీఎం జగన్ మొదటి స్థానంలోకి వెళ్తారని ఆశిస్తున్నాము' అని అన్నారు. పర్యటనలో భాగంగా మంత్రి రూ.10కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి పినిపే విశ్వరూప్‌ టీడీపీ నేత యనమల రామకృష్ణుడిపై తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. దొడ్డి దారిన పదవి అనుభవించిన దద్దమ్మవి నువ్వు జగన్‌ని విమర్శించే నైతిక విలువలు నీకు లేదు ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement