విజయవాడ: ప్రభుత్వం నుంచి మెడికల్ హెల్ప్ కోసం ఎదురుచూస్తున్న బాధితులను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. మంత్రి నారా లోకేష్ పేరును ఉపయోగించి సైబర్ నేరగాళ్లు మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. లోకేష్ ఫోటో ఉపయోగించి సైబర్ కేటుగాళ్లు ఈ నేరాలకు పాల్పడ్డారు. అమాయకుల వద్ద నుంచి లక్షల రూపాయలు దోచేసిన ముగ్గురు నిందితులు. సోషల్ మీడియా వేదికగా సురేంద్ర టిడిపి ఎన్.అర్.ఐ కన్వీనర్ అంటూ మోసాలు చేశారు.
వాట్సాప్ డీపి నారా లోకేష్ ది ఉండటంతో నిజమని నమ్మిన బాధితులు. నిందితులు రాజేష్, సాయి శ్రీనాథ్, సుమంత్‌లను సీ.ఐ.డీ పోలీసులు అరెస్ట్ చేశారు.
పది లక్షల రూపాయలు వీత్ డ్రాకి అనుమతి వచ్చింది అంటూ.. ట్యాక్స్ లు పేరిట బాధితుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ ఘటనలో 9 మంది బాధితుల నుంచి 54 లక్షల రూపాయల కాజేసిన కేటుగాళ్లు.


