
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 61,038 నమూనాలు పరీక్షించగా 618 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కోవిడ్ కారణంగా కృష్ణా, నెల్లూరు, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,05,70,843 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 785 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 8,61,153 మంది ఈ వైరస్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,259 యాక్టివ్ కేసులు ఉన్నాయి