
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,063 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 11 మరణాలు సంభవించాయి. ఇక నిన్న 1,929 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 19,65,657 మంది కోలుకున్నారు గత 24 గంటల్లో 59,198 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు 2,57,67,609 మందికి కరోనా పరీక్షలు చేశారు. మొత్తం 13,671 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 16,341 యాక్టివ్ కేసులున్నాయి.
చదవండి: మిశ్రమ టీకాలు వేయించుకోవచ్చా..?