
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా మరో 438 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్‌తో చిత్తూరు, నెల్లూరు జిల్లాలో ఒక్కొక్కరు మరణించారు. కాగా రాష్ట్రంలో గత 24 గంటల్లో 64,236 మందికి పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 589మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటి వరకూ రాష్ట్రంలో 1,12,60,810 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇక మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,67,445కి చేరింది. తాజాగా మరో ఇద్దరు మృతితో మొత్తం మరణాలు7,076కి చేరాయి. యాక్టివ్ కేసులు 4,202 ఉన్నాయి. (భారత్‌లో కొత్తగా 26,624 కరోనా కేసులు)