
ఎన్‌బీపై వేటుకు రంగం సిద్ధం?
నేడు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు
సాక్షి, అమరావతి: మంత్రి రాసలీల విషయం బయటపెట్టినందుకు టీడీపీ అధికారప్రతినిధి ఎన్‌బీ సుధాకర్‌రెడ్డిపై వేటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, శాప్ చైర్మన్, రాసలీలల మంత్రి ముగ్గురూ కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై ఒత్తిడి చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. టీడీపీ అధికార ప్రతినిధి ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి ఇటీవల టీడీపీ ఎల్లో చానళ్లు ఏబీఎన్, టీవీ5 డిబేట్‌లో మాట్లాడారు.
ఆ డిబేట్లో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ సందర్భంలో టీడీపీ అధికార ప్రతినిధి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఓ మంత్రి తిరుపతికి వచి్చన సమయంలో స్టార్ హోటల్లో ఉంటూ మహిళలతో రాసలీలల్లో మునిగి తేలుతుంటారని బాంబు పేల్చారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి.
దీంతో టీడీపీ అధిష్టానం ఆ మంత్రి రాసలీలలు, ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది. ఆ కమిటీ తిరుపతిలో విచారించినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే... ఇక్కడ రాసలీలల విషయం పక్కకు పోయి, ఎన్‌బీ సుధాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలనే అంశంపై తెరపైకి వచి్చంది. టీడీపీలోని ముఖ్య నేతలు ఎన్‌బీపై చర్యలకే పట్టుబడుతున్నట్లు తెలిసింది.
పిలిచి అవమానిస్తున్నారా?
తిరుపతిలో మానసిక వైద్యులుగా ఉన్న ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి టీడీపీకి వీర విధేయుడు. సోషల్ మీడియా వేదికగా నిత్యం ప్రతిపక్షాలపై విమర్శలు చేసేవారు. ఇదే ప్రామాణికంగా తీసుకుని చంద్రబాబు తనను పిలిచి మాట్లాడారని అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారు. 2020లో ఓసారి అమరావతికి పిలిపించి ఎమ్మెల్సీ ఇస్తానని, మరోసారి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలిసింది. కూటమి అధికారంలోకి రాగానే ఎన్‌బీకి అధికార ప్రతినిధి హోదా కట్టబెట్టారు.
ఏడాదిగా కూటమిలో జరుగుతున్న పరిణామాలు, మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై సన్నిహితులు, పార్టీ శ్రేణుల వద్ద ఎన్‌బీ తీవ్ర అసహనం వ్యక్తం చేసేవారని సమాచారం. స్టార్ హోటల్లో ఉన్న మంత్రిని కలిసేందుకు వెళ్లినప్పుడు అక్కడ జరుగుతున్న బాగోతాల గురించి తెలిసినట్లు సన్నిహితులతో చెప్పుకునేవారు.
అదే విషయాలను ఎల్లో చానల్ డిబేట్‌లో ప్రస్తావించారు. ఆ విషయాలను జీరి్ణంచుకోలేని టీడీపీ నేతలు ఎన్‌బీ సుధాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. మంగళవారం అమరావతిలో టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి హాజరు కానున్నారు. తనపై చర్యలు తీసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, సీఎం, మంత్రి లోకేశ