CM YS Jagan to visit Guntur and Kurnool districts tomorrow - Sakshi
Sakshi News home page

గుంటూరు, కర్నూలు జిల్లాల‍్లో సీఎం జగన్ పర్యటన

May 31 2023 5:51 PM | Updated on May 31 2023 6:55 PM

CM YS Jaganmohan Reddy will visit Guntur and Kurnool Districts Tomorrow - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‍రెడ్డి రేపు (గురువారం) గుంటూరు, కర్నూలు జిల్లాల‍్లో పర్యటించనున్నారు. ఉదయం 7.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా మంగళగిరికి చేరుకుంటారు.

అక్కడ సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్న పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి సోదరుడు పేర్నాటి రామలింగారెడ్డి కుమారుడు కౌశిక్‌ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం అక్కడ నుంచి గన్నవరం చేరుకుని.. కర్నూలు జిల్లాకు బయలుదేరుతారు. 

పత్తికొండలోని సెయింట్‌ జోసెఫ్‌ ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభా వేదికపై ప్రసంగించనున్నారు. అనంతరం, వరుసగా ఐదో ఏడాది తొలివిడత వైయస్సార్‌ రైతుభరోసా- పీఎం కిసాన్‌ పథకం లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. సభ అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
చదవండి:ఏపీ: బడి గంట రోజే ‘కానుక’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement