రేపు పోలవరానికి సీఎం వైఎస్‌ జగన్‌ | CM YS Jagan visit to Polavaram tomorrow | Sakshi
Sakshi News home page

రేపు పోలవరానికి సీఎం వైఎస్‌ జగన్‌

Jul 18 2021 2:49 AM | Updated on Jul 18 2021 6:09 PM

CM YS Jagan visit to Polavaram tomorrow - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. ఈ పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జల వనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేస్తారు.

సోమవారం ఉదయం 10.10 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 11 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. 11.10 –12 గంటల మధ్య పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. 12 నుంచి ఒంటి గంట వరకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు తన నివాసానికి చేరుకుంటారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement