ఇడుపులపాయకు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

CM YS Jagan reached Idupulapaya - Sakshi

వేంపల్లె: తన మామ, దివంగత డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం గన్నవరం నుంచి బయలుదేరి సాయంత్రం 4.40 గంటలకు వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయకు చేరుకున్నారు. హెలిప్యాడ్‌ వద్ద ముఖ్యమంత్రికి కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. వారందరినీ ఆయన ఆప్యాయంగా పలకరించారు. వారు ఇచ్చిన వినతులు స్వీకరించారు. సాయంత్రం 5.28 గంటలకు ఇడుపులపాయలోని అతిథి గృహానికి బయలుదేరి వెళ్లారు.
వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ చేరుకొని స్థానికులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

ఆదివారం ఉదయం పులివెందులలో జరిగే డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభకు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్సీలు జకియా ఖానం, రమేష్‌ యాదవ్, వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్‌.రఘురామిరెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, రవీంద్రనాథరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రఘురామిరెడ్డి, బిజేంద్రనాథరెడ్డి, పరిశ్రమల శాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత వైఎస్‌ మనోహర్‌రెడ్డి, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, పలువురు స్థానిక నేతలు ఉన్నారు.     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top