తెలుగుజాతి తెగువకు నిలువెత్తు నిదర్శనం అల్లూరి : సీఎం జగన్

సాక్షి, తాడేపల్లి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలుగుజాతి తెగువకు నిలువెత్తు నిదర్శనమైన మన్యం వీరుడు అల్లూరి జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమని సీఎం వైఎస్ జగన్ కొనియాడారు. ఈ మేరకు ‘ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్ర పోరాటం కోసం బ్రిటీష్ సామ్రాజ్యమనే మహాశక్తిని ఢీకొన్న విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. తెలుగుజాతి తెగువకు నిలువెత్తు నిదర్శనమైన మన్యం వీరుడు అల్లూరి జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకం. అల్లూరి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నా’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 4, 2021