పద్మ అవార్డు గ్రహీతలకు సీఎం జగన్ అభినందనలు

సాక్షి, తాడేపల్లి: పద్మ అవార్డు గ్రహీతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. విశేష ప్రతిభతో అవార్డులు గెలుచుకోవడం గర్వించదగిన విషయమని సీఎం జగన్ పేర్కొన్నారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం మొత్తం 106 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో 91 మందికి పద్మశ్రీ, 9 మందికి పద్మభూషణ్, ఆరుగురికి పద్మవిభూషణ్ అవార్డులు దక్కాయి. ఏపీ నుంచి ఏడుగురికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి.
చదవండి: (‘పద్మ’ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. మొత్తం 106 మందికి)