నూతన పార్లమెంటు భవనం ప్రారంభంపై సీఎం జగన్ ట్వీట్

Cm Jagan Tweet On Inauguration Of New Parliament Building - Sakshi

సాక్షి, అమరావతి: నూతన పార్లమెంటు భవనం ప్రారంభంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేయబోతున్న ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు.

‘‘పార్లమెంటు అనేది ప్రజాస్వామ్య దేవాలయం. అది మన దేశం యొక్క ఆత్మను ప్రతిబింబిస్తుంది. అది మన దేశ ప్రజలకే కాదు, అన్ని రాజకీయ పార్టీలకు చెందినది. ఇలాంటి శుభకార్యక్రమాన్ని బహిష్కరించడం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు. రాజకీయ విభేదాలన్నింటినీ పక్కనపెట్టి, ఈ మహత్తర కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరుకావాలని కోరుతున్నాను. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి వైసీపీ  హాజరవుతుంది’’ అని ట్విట్టర్‌లో సీఎం జగన్ పేర్కొన్నారు.
చదవండి: సీఎం జగన్‌ను కలిసిన జర్మనీ కాన్సుల్‌ జనరల్‌ మైకేలా కుచ్లర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top