ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: మంగళగిరి ప్రచార సభలో సీఎం జగన్‌

Published Fri, May 10 2024 12:01 PM

AP Elections 2024: CM YS Jagan Speech At Mangalagiri Siddham

గుంటూరు, సాక్షి:  సాధ్యంకాని హామీలతో టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారు. కానీ, మేం 99 శాతం హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు ఒక విశ్వసనీయత తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా మేనిఫెస్టో ఆధారంగానే ఎన్నికల్లో   ఓటేయమని అడుగుతున్నాం అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గుంటూరు మంగళగిరిలో శుక్రవారం ఉదయం వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార భేరీలో ఆయన ప్రసంగించారు.

‘‘మంగళగిరి సిద్ధమేనా? దేవుడి దయతో వాతావరణం కాస్త చల్లగా ఉంది. మీ చిక్కటి చిరునవ్వుల నడుమ, ఇందరి ప్రేమానురాగాలు, ఇందరి ఆప్యాయతలు, ఇందరి ఆప్యాయతల నడుమ మీ అందరికి కూడా.. నా ప్రతి అక్కకూ, నా ప్రతి చెల్లెమ్మకి, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితునికీ .. మీ బిడ్డ మీ జగన్‌ రెండు చేతులు జోడించి , హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

జరగబోయే ఎన్నికలు.. కేవలం మూడు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతున్న ఎన్నికలు కావు. ఈ జరగబోయే ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. మళ్లీ ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటమే. ఇదే.. ఇదే..  చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలకు అర్థం.  ప్రతీ ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. పొరపాటును చంద్రబాబుకి ఓటేయడం అంటే.. కొండచిలువ నోట్లో తల పెట్టడమే అని గుర్తు పెట్టుకోవాలి. అందరికీ ఈ విషయాలు చెబుతూ.. నా మాటలపై ఆలోచన చేయండి.  

గత 59 నెలల  మీ బిడ్డ పాలనలో గతంలో ఎప్పుడూ లేని విధంగా.. ఏకంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు వివిధ పథకాలకు మీ బిడ్డ 130 సార్లు బటన్‌ నొక్కితే నేరుగా నా అక్కచెల్లమ్మల ఖాతాల్లోకి, వాళ్ల చేతుల్లోకి జమ అవుతున్నాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. మీ బిడ్డ బటన్‌నొక్కడం.. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లడం. మీ బిడ్డ రాక మునుపు, మీ బిడ్డ పాలనకు మునుపు ఈ విధంగా బటన్‌లు నొక్కడం, నేరుగా ఖాతాల్లోకి వెళ్లడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఆలోచన చేయండి.

ఏకంగా.. గతంలో ఎప్పుడూ చూడని విధంగా 2లక్షల 31  వేల ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ పాలనలోనే వచ్చాయి. దశాబ్దాలుగా ఉన్న ఉద్యోగాలు 4 లక్షలు. కేవలం 59 నెలల పాలనలోనే రెండు లక్షల ఉద్యోగాలిచ్చాం. గత చరిత్రలో ఇది ఎప్పుడూ జరగలేదని సగర్వంగా చెబుతున్నా. ఇందులో లక్షా 35 వేల మంది మన కళ్లముందు సచివాలయాల్లో కనిపిస్తున్నారు.

ఇంతకుముందు అంతా ఎన్నికల మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు వస్తారు. రంగురంగుల కాగితాలతో, రంగురంగుల ఆశలకు అబద్ధాలకు రెక్కలు కట్టి చెప్పేవారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే పరిస్థితి. కనీసం వెతికినా దొరికేది కాదు. ఆ సంప్రదాయాన్ని మార్చి, గతంలో ఎప్పుడూ చూడని విధంగా దేశంలోనూ ఎక్కడా చూడని విధంగా..  ఏకంగా 99% హామీలు నెరవేర్చి, ఆ మేనిఫెస్టోను నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకే పంపించి, మీ బిడ్డ పాలనలో ఇవన్నీ జరిగాయా? లేదా? మీరే టిక్కు పెట్టండి, మీ జగన్‌ ఇవన్నీ చేశాడు.. మీరే మీ బిడ్డకు ఆశీస్సులు ఇవ్వండి అంటూ మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది మీ బిడ్డ పాలనలోనే. ఆలోచేన చేయండి.. ఇది మీ బిడ్డ పాలనలో కాదా?.

ఇప్పుడు నేను గడగడా కొన్ని పథకాల పేర్లు మచ్చుకు చెబుతాను.. ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఈ పథకాలన్నీ మీకు అందాయా అని మీరే ఆలోచించండి. గవర్నమెంట్‌ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, ఇంగ్లీష్‌ మీడియం నుంచి ఐబీ దాకా ప్రయాణం, టోఫెల్‌ క్లాసులు, బైలింగువల్‌ టెక్స్ట్‌ బుక్‌లు మన పిల్లల చేతుల్లోనే కనిపిస్తున్నాయి.

బడులు తెరిచేసరికే విద్యాకానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ చరిత్రలో ఎప్పుడూ జరగని రీతిలో ఓ అమ్మ ఒడి.. గతంలో ఉన్నాయా? గతంలో జరిగిందా?. పూర్తి ఫీజులతో...ఏ అక్కా...ఏ చెల్లెమ్మా తన పిల్లల చదువుల కోసం అప్పులపాలు అవ్వకూడదని, పెద్ద చదువుల కోసం పూర్తి ఫీజులతో ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన.. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ చదువుతున్న వాళ్లు 93 శాతం ఫీజు రియంబర్స్‌మెంట్‌ పొందుతున్నది ఈ 59 నెలల కాలంలోనే. ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీలతో ఆన్‌లైన్‌ సర్టిఫైడ్‌ కోర్సులను డిగ్రీ స్థాయిలో.. ఇలా చదువుల్లో మీ బిడ్డ తెచ్చిన విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయండి. 15 ఏళ్ల తర్వాత.. ఐబీ సర్టిఫికెట్‌ పదో తరగతి పాసైతాడు. మరో మూడేళ్లకు డిగ్రీ చేసి.. అంతర్జాతీయ యూనివర్సిటీల నుంచి కోర్సులతో పట్టా పుచ్చుకుంటాడు. అనర్గళంగా ఇంగ్లీష్‌ మాట్లాడుతూ.. ఉద్యోగాలకు అప్లికేషన్‌ పెట్టుకుంటే ఎలా ఉంటుంది. పేదల భవిష్యత్తు మారాలి.. అందుకు మీ బిడ్డ అడుగులు వేయడం ఎంత అవసరమో ఆలోచన చేయండి.

గతంలో ఎన్నడూ జరగని విధంగా, చూడని విధంగా.. నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని, వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, అక్కచెల్లెమ్మలకు..  ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్ చేయించే కార్యక్రమంతో పాటు  అందులో 20 లక్షల ఇళ్లు కడుతున్న కార్యక్రమం కూడా చేపట్టాం. అక్కచెల్లెమ్మల కోసం ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం..మహిళా సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూసారా?

నా అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్‌ గతంలో ఎప్పుడైనా జరిగిందా?. ఇంటి వద్దకే రేషన్‌. ఇంటి వద్దకే పౌర సేవలు. ఇంటి వద్దకే పథకాలు రావడం.. గతంలో ఎప్పుడైనా జరిగాయా?.  రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతున్నాను. రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్, ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.

స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ.. సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర,  నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసాతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు, పక్కనే తోపుడు బళ్లలో ఉన్నవాళ్లకు, ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు, శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ చేదోడు, ఓ తోడు అనే పథకం అందిస్తున్నాం. లాయర్లకు ఒక లా నేస్తం. ఇలా పేదలకు తోడుగా ఉంటూ.. స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగాయా?. ఈ పథకాలు గతంలో ఉండేటివా?..

ఏ పేదవాడు అప్పులు పాలవ్వకూడదని.. ఏ పేదవాడు వైద్యం అందక ఇబ్బంది పడకూడదు.. వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆరోగ్యశ్రీని విస్తరించాం. ఏ పేదవాడికి అయినా వైద్యం కోసం 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. రెస్ట్‌ పీరియడ్‌లో పేదవాడికి ఆరోగ్య ఆసరా. పేదవాడికి అండగా గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్‌. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్‌. ప్రతీ ఇంటిని జల్లెడ పడుతూ.. ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇంతగా ఆరోగ్యం మీద దృష్టి పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందా?.

ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్‌

వీటన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్లినా కూడా.. 600 రకాల సేవలు అందించే సచివాలయం. ఏ గ్రామానికి వెళ్లినా.. 60-70 ఇళ్లకు ఒక వలంటీర్తో కూడిన వ్యవస్థ. నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ విలేజ్ క్లినిక్‌. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడు ద్వారా బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి. గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలోనే డిజిటల్ లైబ్రరరీ. ఇవన్నీ కాక గ్రామంలోనే నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం మహిళా పోలీస్. అక్కచెల్లెమ్మల ఫోన్‌లో దిశ యాప్. ఈ పథకాలు, ఈ మార్పులు, ఈ లంచాలు.. వివక్ష లేని పాలన గతంలో జరిగిందా?.. అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు అండగా నిలిచిన పాలన ఇది. ఆలోచన చేయండి.

మరో పక్క చంద్రబాబునే గమనించండి. పద్నాలుగేళ్లు సీఎంగా చేసిన వ్యక్తి.. ఆయన పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా పథకం లేదు. ఆయన పాలన ఎలా ఉండేదో గమనించండి. చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు. అధికారం తప్పితే.. ఆయన మాయలు, ఆయన మోసాలు ఎలా ఉంటాయో. ఈ పాంప్లెట్‌ గుర్తుకు తెచ్చుకోండి. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు.. ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడ్డాడు. ఈ ఫాంప్లెట్‌ను ముఖ్యమైన హామీలంటూ స్వయంగా సంతకం పెట్టి పంపించాడు. 2014-19 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈ పాంప్లెట్‌లో చెప్పినవి ఒక్కటైనా జరిగాయా? నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి.

రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ అయ్యాయా? రెండో హామీ.. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నారు. మరి రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాల్లో.. ఒక్క రూపాయైనా మాఫీ చేశారా?. ఆలోచన చేయండి. మూడో హామీ.. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. నేను అడుగుతున్నా.. రూ.25 వేల కథ దేవుడెరుగు.. ఏ ఒక్కరి అకౌంట్లలో అయినా ఒక్క రూపాయి అయినా వేశారా?. నాలుగో ముఖ్యమైన హామీ.. ఇంటింటికీ ఉద్యోగం.ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నారు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఇచ్చారా?. ఐదో హామీ.. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. మీ అందరినీ కూడా నేను అడుగుతున్నాను. ఇన్ని వేల మంది ఇక్కడున్నారు కదా. చంద్రబాబు హయాంలో చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రూ.10,000 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌, చేనేత పవర్‌ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా?. విమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా? సింగపూరుకు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా? ఒక్కటంటే.. ఒక్క హామీ నెరవేరిందా?.  పోనీ ప్రత్యేక హోదా అయినా ఇచ్చాడా? దాన్నీ అమ్మేశాడు. మరి నేను అడుగుతున్నాను. ఇలాంటి వాళ్లను నమ్మొచ్చా? ఆలోచన చేయండి.

మళ్లీ.. కొత్త మేనిఫెస్టో డ్రామా. మళ్లీ ఇదే ముగ్గురూ. మళ్లీ చంద్రబాబూ.. సూపర్‌ సిక్స్‌ అంట. నమ్ముతారా?, సూపర్‌ సెవెన్‌ అంట. నమ్ముతారా?. ఇంటింటికీ కేజీ బంగారం అంట. నమ్ముతారా?. ఇంటింటికీ బెంజికారు అంట.  నమ్ముతారా?. మరి ఆలోచన చేయమని అడుగుతున్నా అని సీఎం జగన్‌  ప్రసంగించారు.

Advertisement
 
Advertisement