
సాక్షి, అమరావతి : ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. శనివారం ఆయన కిష్టారెడ్డి కుమారుడు ఎడ్మ సత్యంకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. మనో ధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. హైదరాబాద్ వచ్చాక కలుస్తానని చెప్పారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కిష్టారెడ్డి 1994, 2004 లో కల్వకుర్తి ఎమ్మెల్యే గా పనిచేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ఒకసారి, కాంగ్రెస్ పార్టీ తరపున మరోసారి ఎడ్మ కిష్టారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.