జర్నలిజం మానేసి బ్రోకరిజం చేస్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ
వైఎస్సార్‌సీపీ నాయకులను గేలి చేయడం తగదు
రాధాకృష్ణకూ కుటుంబం ఉంది
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మావిగన్ ప్రతిపాదనపై సర్వత్రా ఆమోదం వ్యక్తమవుతోందని, ప్రజలందరూ స్వాగతిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఈ అంశాన్ని డైవర్ట్ చేసేందుకే సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. సోమవారం వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో రాచమల్లు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు రూ.2 లక్షల కోట్లతో ఆమోదయోగ్యం కాని, ఆచరణకు నోచుకోని అమరావతిని నిర్మించాలనుకున్నారని చెప్పారు.
వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ కేవలం రూ.20 వేల కోట్లతో గ్రోత్ ఇంజిన్‌గా దూసుకెళుతుందన్నారు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కారిడార్ ఎంతో అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తులో ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు. మావిగన్ ప్రతిపాదనను ప్రకటించిన రోజే చంద్రబాబులో వణుకు పుట్టిందని చెప్పారు. మావిగన్ ప్రతిపాదనను ప్రజలు ఆమోదిస్తుండటంతో సోషల్ మీడియాలో రూ.కోట్లు ఖర్చు చేసి విపరీతమైన పోస్టులు పెట్టారని, అపహాస్యం చేయడంతోపాటు బూతులు కూడా మాట్లాడారన్నారు.
నీచాతి నీచంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసినా ఎక్కువ రోజులు నిలువలేకపోయిందన్నారు. తర్వాత చంద్రబాబు ఇదే అంశంపై మంత్రులతో ప్రెస్‌మీట్ పెట్టించారన్నారు. అయినా సంతృప్తి చెందని చంద్రబాబు పచ్చ మీడియాను రంగంలో దింపాడన్నారు. ప్రభుత్వాన్ని జాకీలతో పైకిలేపేందుకు జర్నలిజం ముసుగులో ఏబీఎన్ రాధాకృష్ణ బ్రోకరిజం చేస్తున్నాడన్నారు.
అత్యంత జుగుప్సాకర వ్యాఖ్యలవి
ఏబీఎన్ రాధాకృష్ణ వైఎస్సార్‌సీపీ నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్పాకరంగా, బాధాకరంగా ఉన్నాయని రాచమల్లు పేర్కొన్నారు. ఇంతకంటే నీచం మరొకటి ఉండదన్నారు. కండకావరంతో కొవ్వెక్కి రాధాకృష్ణ ఇలాంటి మాటలు మాట్లాడినా.. తమ నాయకుడు వైఎస్ జగన్ మాత్రం శాంతియుతమైన పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేయాలని తమకు చెప్పారన్నారు.
రాధాకృష్ణ నాలుక కోసి.. ఉప్పూకారంతో ఊరగాయ పెడతారు
స్త్రీలను దూషిస్తున్న ఏబీఎన్ రాధాకృష్ణను ఏ మహిళ అయినా మెట్టుతో కొట్టదా అని రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమ ఆడబిడ్డలైతే రాధాకృష్ణ ఇంటికెళ్లి నాలుక కోసి ఉప్పుకారం వేసి ఊరగాయ పెడతారన్నారు. చంద్రబాబు ఎంతటి నీతిబాహ్యమైన చర్యలకు దిగుతున్నాడో ప్రజలు గమనించాలని కోరారు. కేవలం వైఎస్ జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనను పక్కదోవ పట్టించడానికి ఇంతటి నీచానికి దిగజారాలా అన్నారు.
‘రాధాకృష్ణా.. నీకూ భార్యాబిడ్డలు ఉన్నారు కదా. నీలా మేం మాట్లాడితే సరిపోతుందా. ఇవే మాటలు నీ భార్య దగ్గర మాట్లాడితే నీ భార్య కూడా నిన్ను చెప్పుతో కొడుతుంది. మేం నీలా మాట్లాడలేం. జర్నలిజం ముసుగులో ఇలాంటి అక్షర వ్యభిచారం చేయొద్దు అని రాధాకృష్ణకు అతడి ఇంట్లోని మహిళలు గడ్డిపెట్టాలి’ అని రాచమల్లు కోరారు.


