సాక్షి,విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబుకి వెన్నులో వణుకుపుడుతోందని మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు. ఈ రోజు( సోమవారం) వైజాగ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం చేయెుచ్చనే ఆలోచనతో చంద్రబాబు భయపడుతున్నారన్నారు. జగన్ మాట ఎంత పవర్ ఫుల్ అనేది ఇప్పుడు వారికి అర్ధమవుతుంది. మావిగన్ ప్రతిపాదన అమరావతి అవినీతిపై ఎక్కు పెట్టిన గన్‌లా వారికి కనిపించింది. రూ.20 వేల కోట్ల ఖర్చు చేస్తే మచిలీపట్నం విజయవాడ గుంటూరు అభివృద్ధి చెందుతుంది. ఇదివరకే అమరావతి కోసం చంద్రబాబు రూ. ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేశారు. అమరావతి కోసం చంద్రబాబు రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తారని ఏబీఎన్ రాధాకృష్ణ రాస్తున్నారు.ఓ వైపు జీతాలకు డబ్బులు లేవని ఆర్ధిక మంత్రి అంటూనే మరోవైపు వృథాగా డబ్బు ఖర్చు చేస్తున్నారు.
కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరి అమరావతిని, కమ్మరావతి పిలుస్తున్నారు. అమరావతి అందరి రాజధాని అయితే కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరి మాటలను కూటమి నేతలు ఎందుకు ఖండించడం లేదు. ఏబీఎన్ రాధా కృష్ణ చెత్త పలుకు రాసారని దిగజారి రాతలు రాస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై కడుపు మంటతోనే తప్పుడు రాతలు రాస్తున్నారు. జగన్ తిరిగి అధికారంలోకి వస్తాడనే పదమే కూటమి ప్రభుత్వానికి ఉరుకులు పెట్టిస్తోందని వ్యాఖ్యానించారు.


