వైఎస్సార్‌ను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న బొత్స | Botsa Satyanarayana Emotional While Remembering Ysr | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న బొత్స

Apr 9 2026 5:36 PM | Updated on Apr 9 2026 6:42 PM

Botsa Satyanarayana Emotional While Remembering Ysr

సాక్షి, విశాఖపట్నం: దివంగత మహానేత వైఎస్సార్‌ గురించి మాట్లాడుతూ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు. విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్సార్‌ను గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అచ్చెన్నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని.. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు మాటలు మాట్లాడుతున్నారంటూ బొత్స మండిపడ్డారు. వైఎస్సార్‌ మరణంపై అచ్చెన్న దిగజారి మాట్లాడారు. ​​కావాలనే వైఎస్‌ జగన్‌పై బురద జల్లుతున్నారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘వైఎస్‌ జగన్ మాట్లాడిన మావిగన్.. కూటమి నేతలకు నిద్రలో కూడా గుర్తుకు వస్తుంది. మావిగాన్ అంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు. రాజకీయ అవసరాలు కోసం అచ్చెన్నాయుడు జగన్ పై మాట్లాడుతున్నాడు. పార్టీ లేదు బొక్క లేదు అనే మాటలను మర్చిపోయావా?. దేశం గర్వించే వ్యక్తుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు. ఆయన పాదయాత్ర ముగించిన రోజు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. వైఎస్సార్‌ మరణం వెనక జగన్ ఉన్నాడని నేను నీతో అన్నట్లు తప్పుడు మాటలు మాట్లాడతావా?’’ బొత్స ధ్వజమెత్తారు.

‘‘మాకు వైఎస్సార్‌కు విడదీయరాని సంబంధం ఉంది. రాజకీయాలు కోసం పదవుల కోసం నీచమైన రాజకీయాలు చేయకు.. నీకు దమ్ముంటే ప్రజలకు న్యాయం చేయి. అచ్చెన్నాయుడు పదవులు కోసం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు. నువ్వు వైఎస్సార్‌ గురించి మాట్లాడావు కాబట్టి మీడియా ముందుకు వచ్చాను. వైఎస్సార్‌ చనిపోయినప్పుడు వైఎస్‌ జగన్ అక్కడే ఉన్నారు. నేను నా భార్య క్యాంప్ ఆఫీస్ నుంచి జగన్‌ను తీసుకుని వచ్చాము. చనిపోయిన వైఎస్సార్‌ను ఎందుకు రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు.

కంటతడి పెట్టిన బొత్స

..సభ్యత సంస్కారం లేని వ్యక్తి అచ్చెన్నాయుడు. మా చరిత్ర మీకు తెలుసు. మీ చరిత్ర మాకు తెలుసు. మావిగన్ అంటే అందుకు అంత ఉలిక్కి పడుతున్నారు.. మావిగన్ ఎందుకు నోరు మెదపడం లేదు. అచ్చెన్నాయుడు మాటలను ఖండిస్తున్నాను. మావిగన్‌కు వస్తున్న స్పందన చూసి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లు గురించి మాట్లాడుతున్నారు. వ్యక్తిగతంగా నన్ను ఏమన్నా నేను బాధపడను. వైఎస్ మరణం తరువాత జరిగిన సంతకాలకు జగన్‌కు సంబంధం లేదు. ఈ విషయం రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణలకు తెలుసు’’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement