బెల్ట్‌ షాప్‌ వద్దన్నాడని.. సామాజిక బహిష్కరణ! 

Belt Shop Man Social Exclusion Erpedu Tirupati - Sakshi

ఏర్పేడు (తిరుపతి): గ్రామంలో మద్యం అమ్మరాదని ప్రశ్నించాడని ఓ వ్యక్తిని గ్రామ బహిష్కరణ చేసిన సంఘటన మండలంలోని కొత్తవీరాపురంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం.. గ్రామానికి చెందిన పెద్దమనుషులు రామదాసు, కృష్ణారెడ్డి, సుబ్రమణ్యం, కుమార్, గిరిబాబు గ్రామంలో మద్యం అమ్మకాలకుగాను ఆదివారం రాత్రి వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన  శ్రీనివాసులు, పెరిబ్బ, నాగభూషణమ్మ బెల్టు షాపును వేలంలో రూ.75 వేలకు దక్కించుకున్నారు.

ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన కృష్ణయ్య మద్యం అమ్మడానికి వీలులేదని వ్యతిరేకించాడు. దీంతో కృష్ణయ్యతో మాట్లాడినా, ఇంటికి వెళ్లినా, పనులకు వెళ్లినా వారికి జరిమానా విధించి గ్రామ బహిష్కరణ చేస్తామని సోమవారం రాత్రి దండోరా వేశారు. అయితే గ్రామస్తులు దండోరా వేసే వ్యక్తిని మందలించి పంపారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌ తరలించినట్లు సమాచారం.

చదవండి: (Raptadu: టీడీపీ వర్గీయుల చేతిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top