ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సాయిప్రసాద్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం బక్రీద్ సందర్భంగా ఈ నెల 28వ తేదీ గురువారం సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం గతంలో ఈ నెల 27వ తేదీ బక్రీద్ సెలవు దినంగా ప్రకటించింది. అయితే నెల వంక ఆధారంగా ముస్లిం సమాజం బక్రీద్ వేడుకను ఈ నెల 27కు బదులుగా 28 గురువారం నిర్వహించుకోనున్నట్లు విజయవాడ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి మేరకు బక్రీద్ సెలవును ఈ నెల 28వ తేదీకి మార్పు చేసింది.
ఈ నెల 27న ప్రభుత్వ కార్యాలయాలన్నీ యథావిధిగా పని చేస్తాయని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అలాగే షాపులు, ఇతర ఎస్టాబ్లిష్మెంట్లకు సంబంధించి నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ –1881కు అనుగుణంగా బక్రీద్ సాధారణ సెలవును ఈ నెల 27వ తేదీ బదులుగా 28వ తేదీకి మార్పు చేస్తూ సీఎస్ మరో ఉత్తర్వు జారీ చేశారు.


