బహుజనులకు అన్యాయం చేసిన చంద్రబాబు | Bahujan Parirakshana Samiti Leaders Comments On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

బహుజనులకు అన్యాయం చేసిన చంద్రబాబు

Jan 18 2021 5:14 AM | Updated on Jan 18 2021 5:15 AM

Bahujan Parikshana Samiti Leaders Comments On Chandrababu Naidu - Sakshi

దీక్షలో పాల్గొన్న మహిళలు, దళిత సంఘాల ప్రతినిధులు

తాడికొండ: అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేసి.. కుట్రపూరితంగా ఐదువేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బహుజనులకు అన్యాయం చేసింది చంద్రబాబేనని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ధ్వజమెత్తారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలోని సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు ఆదివారం 110వ రోజుకు చేరుకున్నాయి.

పలువురు నాయకులు మాట్లాడుతూ.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన చంద్రబాబు అమరావతి ప్రాంతంలో చిన్నపాటి ఇంటి స్థలం కోసం పేదలు దరఖాస్తు చేసుకుంటే కోర్టులకెక్కి అడ్డుపడటం అన్యాయమన్నారు. ఐదేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖల నిధులను మళ్లించి ఆర్థికంగా దెబ్బకొట్టారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి సంఘాల నేతలు గురునాథం, పరిశపోగు, యోనారాజు తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement