ఆటో డ్రైవర్‌ కుమారుడు.. ఐఏఎఫ్‌లో ఫ్లైయింగ్‌ ఆఫీసర్‌గా 

Auto Drivers Son Becomes IAF Flying Officer In Vizag - Sakshi

ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖలోని ఆరిలోవ ప్రాంతం రవీంద్రనగర్‌ దరి ఎస్‌ఐజీ నగర్‌కు చెందిన ఓ ఆటో డ్రైవర్‌ కుమారుడు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఐఏఎఫ్‌) లో ఫ్లైయింగ్‌ ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు. ఎస్‌ఐజీ నగర్‌కు చెందిన గుడ్ల సూరిబాబు కొన్నేళ్లుగా ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన కుమారుడు గుడ్ల గోపినాథ్‌ రెడ్డి ఎంఎస్సీ, ఎంబీఏ, కుమార్తె గౌరీప్రియ ఎమ్మెస్సీ పూర్తి చేశారు. గోపినాథ్‌ వైజాగ్‌ డిఫెన్స్‌ అకాడమీ (వీడీఏ)లో ఇంటర్, వీఎస్‌ కృష్ణా కాలేజీలో డిగ్రీ, ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ చదువుకున్నారు. 2009లో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో ఉద్యోగం సాధించాడు.

ఇప్పుడు ఆయనను ఫ్లైయింగ్‌ ఆఫీసర్‌గా ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఎంపిక చేసి శిక్షణ ఇచ్చింది. ఆ ఉద్యోగంలో గోపినా«థ్‌ త్వరలో చేరనున్నట్లు అతని తల్లిదండ్రులు సూరిబాబు, చిన్నతల్లి తెలిపారు. కాగా, తమ కుమారుడు దేశ రక్షణ విభాగంలో భాగస్వామ్యం అవడం గర్వకారణంగా ఉందని గోపినాథ్‌ తల్లిదండ్రులు ‘సాక్షి’ కి తెలిపారు.

చదవండి: కేటాయించిన నీటిని వాడుకుంటే తప్పేంటి?

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top