రెండేళ్ల తర్వాత పట్టాలపైకి ‘అరక్కోణం’

Arakkonam Train Likely To Start On July 27th - Sakshi

జూలై  27 నుంచి ప్రారంభం

రాజంపేట: రెండేళ్ల తర్వాత అరక్కోణం రైలు పరుగులు తీయనుంది. ఈ రైలు (06401/06402) వచ్చేనెల 27 నుంచి పునఃప్రారంభంకానుంది. ఈమేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో అన్ని ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేశారు. అప్పటి నుంచి పల్లె ప్రయాణికులకు ఒక్క రైలు కూడా లేకుండాపోయింది. ప్రస్తుతానికి ఒక డెమో రైలు ప్రస్తుతం వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో నడుస్తోంది. 8 కార్‌ మెమూ రేక్‌తో మెమూ నడవనుంది.

కడప వరకు అన్ని పల్లెలో స్టాపింగ్‌
అరక్కోణం నుంచి కడప వరకు అన్ని పల్లెలో స్టాపింగ్‌తో మెమూ రైలు నడుస్తోంది. అరక్కోణం, తిరుత్తణి, పొనపాడి,వెంకటనరసింహారాజుపేట, నగిరి, ఏకాంబరకుప్పం,వేపగుంట, పుత్తూరు, తడకు, పూడి, రేణిగుంట జంక్షన్‌ మీదుగా నడుస్తుంది. అక్కడి నుంచి మామండూరు, బాలపల్లె, శెట్టిగుంట, రైల్వేకోడూరు, అనంతరాజంపేట, ఓబులవారిపల్లె, పుల్లంపేట, రాజంపేట, హస్తవరం,నందలూరు, మంటపంపల్లె, ఒంటిమిట్ట, భాకరాపేట, కనుమలోపల్లె కడప వరకు నడుస్తుంది. చార్జీలు ఎక్స్‌ప్రెస్‌ తరహాలో ఉన్నప్పటికి అన్ని స్టేషన్లలో స్టాపింగ్‌ సౌకర్యం ఉండటం వల్ల కొంతమేర పల్లెప్రయాణికులకు ఊరట లభించింది.

సమయం ఇలా..
మెమూ రైలు రేణిగుంటలో ఉదయం 8.50కి బయలుదేరుతుంది. నందలూరుకు 11 గంటలకు, కడపకు 11.45 గంటలకు చేరుతుంది. తిరుగుప్రయాణంలో సాయంత్రం 3.10 గంటలకు బయలుదేరి, 3.54 గంటలకు నందలూరుకు చేరుకుంటుంది. రైల్వేకోడూరుకు 5.48 గంటలకు, రేణిగుంటకు 5.45 గంటలకు చేరుకుంటుందని రైల్వేబోర్డు తెలి పింది. తమిళనాడు (సదరన్‌రైల్వే) లోని పుత్తూరుకు 6.21 గంటలకు, తిరుత్తిణికి 7గంటలకు, అరక్కోణానికి 7.35 గంటలకు చేరుకుంటుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top