కరోనా కట్టడికి ఏపీఎండీసీ రూ.100 కోట్ల విరాళం

APMDC donates Rs 100 crore to Corona prevention - Sakshi

సీఎం సహాయ నిధికి అందజేత సీఎం జగన్‌కు చెక్కులను అందించిన మంత్రి పెద్దిరెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎండీసీ) భారీ సాయం అందించింది. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.100 కోట్లు విరాళం అందించింది. డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ నుంచి రూ.90 కోట్లు, ఏపీఎండీసీ నుంచి రూ.10 కోట్లు అందజేసింది.

గనులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విరాళాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, గనులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏపీఎండీసీ వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.జి.వెంకటరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top