గిన్నిస్‌ బుక్‌లోకెక్కిన ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగి

AP Village Secretariat Employee In Guinness Book Of World Records - Sakshi

నరసాపురం: పెన్సిల్‌ లెడ్‌పై అతుకులు లేకుండా, ఎలాంటి సూక్ష్మ పరికరాలు వినియోగించకుండా సూదిమొనతో 246 లింకులు చెక్కినందుకు గాను ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులోకి ఎక్కాడు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లిఖితపూడి గ్రామ సచివాలయంలో అసిస్టెంట్‌ సర్వేయర్‌గా పనిచేస్తున్న కొప్పినీడి విజయమోహన్‌కు సూక్ష్మ కళాకారుడిగా పేరు ఉంది. సూదిమొనతో బియ్యపు గింజలపై కళాకృతులు చెక్కి ఇప్పటికే లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌తో పాటు పలు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నాడు.

రాష్ట్రీయ యువగౌరవ్‌ సమ్మాన్‌ అవార్డును మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నాడు. 50 వరకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నాడు. విజయమోహన్‌ తండ్రి వరహాలరావు ఆటో డ్రైవర్‌. తల్లి నాగ సుశీల గృహిణి. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన విజయమోహన్‌ 2019 అక్టోబర్‌లో గ్రామ సచివాలయంలో ఉద్యోగం సంపాదించాడు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top