AP: సీఎస్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ సమావేశం

Ap State Investment Promotion Committee Meeting Chaired By Cs - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్ కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన వివిధ కంపెనీలకు ప్రభుత్వపరంగా సమకూర్చాలిన భుములు, వివిధ రాయితీలు, ఇతర ప్రోత్సాహకాల కల్పన అంశాలపై విస్తృతంగా చర్చించడం జరిగింది.

ముఖ్యంగా పరిశ్రమల శాఖలో ప్రత్యేక ఫ్యాకేజీ ఇన్సెంటివ్‌లకు సంబంధించి ఎనిమిది అజెండా అంశాలతో పాటు విధాన నిర్ణయాలకు చెందిన అంశాలపైన కమిటీ సమీక్షించింది. అదే విధంగా ఐటి అండ్ సి శాఖకు సంబంధించి ఎనిమిది అజెండా అంశాలు, ఇంధన శాఖకు సంబంధించిన అజెండా అంశాలపైన సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఆయా పరిశ్రమలు, కంపెనీలకు అందించాల్సిన ప్రోత్సాకాలు తదితర అంశాలపై చర్చించి విధాన పరమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకా ఈ సమావేశంలో పలు అంశాలపై కూడా సీఎస్ డా.కెఎస్ జవహర్ రెడ్డి అధికారులతో చర్చించారు.


చదవండి: ఏంటి లోకేశా ఇదీ?.. నరాలు కట్‌ అయిపోతున్నాయ్‌..!

ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కరికల వలవన్, కె.ప్రవీణ్ కుమార్, ఎస్ఎస్ రావత్ పాల్గొనగా దృశ్య మాధ్యమం ద్వారా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పాల్గొన్నారు. అలాగే ఈసమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్, ఎంఏయుడి కమిషనర్ ప్రవీణ్ కుమార్, పరిశ్రమల శాఖ కమిషనర్ సృజన, ఏపీ మారిటైమ్ బోర్డు సీఇవో షన్మోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top