ఎంపీపీ, జెడ్పీ చైర్మన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

AP: MPP ZP Chairman Election Notification Released - Sakshi

25న ఎంపీపీ, వైస్‌ఎంపీపీ, 26న జెడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక

ప్రకటన విడుదల చేసిన ఎన్నికల సంఘం

సాక్షి, అమరావతి: ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలకు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 24వ తేదీన ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికలు నిర్వహించనుండగా అదే రోజు కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నిక చేపట్టనున్నారు. మరుసటి రోజు 25వ తేదీన జెడ్పీ చైర్మన్, రెండు జెడ్పీ వైస్ చైర్మన్లకి ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజు జెడ్పీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగనుంది.

మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలు ఇలా..
20వ తేదీలోపు ఎంపీటీసీ సభ్యులందరికీ ప్రత్యేక సమావేశంపై నోటీసులు.
24న ఉదయం 10 లోపు మండల పరిషత్‌లో కో ఆప్షన్ సభ్యుడి ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ, ఎన్నిక.
మధ్యాహ్నం 1 గంట: కో ఆప్షన్ సభ్యుడి ప్రమాణ స్వీకారం
3 గంటలకు: ప్రత్యేక సమావేశంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎంపిక

జెడ్పీ చైర్మన్ ఎన్నిక
జెడ్పీటీసీలకు 21వ తేదీలోపు ప్రత్యేక సమావేశంపై నోటీసులు
25వ తేదీన ఉదయం పది గంటలలోపు ఇద్దరు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ
ఉదయం పది నుంచి ఒంటి గంట లోపు స్క్రూటినీ, నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, ఎన్నిక
మధ్యాహ్నం ఒంటి గంట: కోఆప్షన్ సభ్యుల ప్రమాణస్వీకారం
3 గంటలకు: జెడ్పీ చైర్ పర్సన్, రెండు వైఎస్ చైర్మన్లకు ఎన్నిక

  • ఎంపీపీ ఎన్నికలకు ప్రిసైడింగ్ అధికారిగా కలెక్టర్ నామినేట్ చేసిన గెజిటెడ్ అధికారి వ్యవహరించనున్నారు.
  • జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్న కలెక్టర్లు
  • ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు అనివార్య కారణాల నిర్వహించలేకపోతే మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించాలి.
  • ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నికల సమావేశానికి ఎమ్మెల్యేలు ప్రత్యేక ఆహ్వానితులుగా అనుమతి. ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉండదు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top