ఏపీ గ్రూప్- 1 మెయిన్స్ ఫలితాలు విడుదల

అమరావతి: 2018లో విడుదలైన గ్రూప్-1 నోటిఫికేషన్‌కు సంబంధించి మెయిన్స్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) బుధవారం విడుదల చేసింది. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్ (www.psc.ap.gov.in)లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారులు ఉంచారు. అభ్యర్థులకు జూన్ 14వ తేదీ నుంచి ముఖాముఖి పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఏపీపీఎస్సీ అధికారులు సూచించారు.
చదవండి: ఆక్సిజన్ సిలిండర్ కోసం 24 గంటల్లో 1,500 కి.మీ జర్నీ
చదవండి: రాబోయే 3, 4 వారాలు చాలా కీలకం.. మరింత జాగ్రత్త