టీటీడీ వారసత్వ అర్చకుల నియామకంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP Govt Appointment One Man Committee For TTD Hereditary Priests - Sakshi

సాక్షి, విజయవాడ : తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకుల శాశ్వత నియామకంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీలో వంశపారంపర్యంగా వచ్చే అర్చకుల శాశ్వత నియామకంపై ఏక సభ్య కమిటీని నియమించింది. వారసత్వ అర్చకుల వ్యవస్థ బలోపేతం, క్రమబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ టీటీడీలో వారసత్వ అర్చక విధానాన్ని మరింత బలంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించనుంది. ఇందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి బి. శివ శంకర్‌రావుని కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

దీనిపై అధ్యయనం చేసి 3 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఏక సభ్య కమిటీని కోరింది ఏపీ ప్రభుత్వం. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ తరహా వారసత్వ అర్చకుల శాశ్వత నియామకం ఉందని పేర్కొన్న ప్రభుత్వం.. టీటీడీ అర్చకులు, భక్తుల నుంచి వచ్చిన వేర్వేరు విజ్ఞప్తుల మేరకు ఏక సభ్య కమిటీ నియమించినట్టు స్పష్టం చేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top