AP: ఒడిశా తీరంలో చిక్కుకున్న మత్స్యకారులు సురక్షితం | AP Govt Alert: Fishermen Boats Stuck At Coast Of Odisha | Sakshi
Sakshi News home page

AP: ఒడిశా తీరంలో చిక్కుకున్న మత్స్యకారులు సురక్షితం

Sep 15 2021 8:35 AM | Updated on Sep 15 2021 12:12 PM

AP Govt Alert: Fishermen Boats Stuck At Coast Of Odisha - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విశాఖపట్నం: ఒడిశా తీరంలో చిక్కుకున్న మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. విశాఖతీరానికి చెందిన 30 బోట్లు గంజాం పోర్ట్ లో వున్నాయన్నారు. వాతావరణం సాధారణంగా మారిన తర్వాత చేపలవేటకు అనుమతిస్తామని జిల్లా కలెక్టర్‌ ఏ మల్లిఖార్జున్‌ తెలిపారు. మత్స్యకారుల చిక్కుకుపోయారనే సమాచారం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. మత్స్య శాఖ జేడీ లక్ష్మణరావు గంజాం పోర్ట్ అధికారులతో చర్చలు జరిపారు.

గంజాం పోర్టులోకి 17 బోట్లను అనుమతించారు. మిగిలిన బోట్లను కూడా తీరానికి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు అధికారులు మత్స్యకారులు, వారికి సంబంధించిన బోట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఒడిశా సమీపంలో వాయుగుండం
సాక్షి, విశాఖ దక్షిణ: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఒడిశాకి పశ్చిమ వాయవ్య దిశగా 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ మీదుగా ప్రయాణించి బలహీనపడి 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల రెండు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. మేఘాలు లేకపోవడంతో ఎండ ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తిరుపతిలో 37.2, కావలిలో 36.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement