ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల

AP ECET 2020 Result Released - Sakshi

ఏపీ ఈసెట్‌లో 96.12 శాతం ఉత్తీర్ణత

సాక్షి, విజయవాడ : ఇంజనీరింగ్‌ డిప్లొమో పూర్తిచేసిన విద్యార్ధులు తదుపరి ఉన్నత సాంకేతిక విద్యన కొనసాగించేందుక వీలుగా నిర్వహిస్తున్న ఏపీ ఈసెట్‌-2020 ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు.  విద్యా శాఖ స్పెషల్ సిఎస్ సతీష్ చంద్ర, ఎపి  ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, సెక్రటరీ సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్‌ 14న రాష్ట్రంలోని 79 కేంద్రాల్లో ఆన్‌లైన్‌ ద్వారా ఈ పరీక్షలు నిర్వహించారు. 31,891 మంది పరీక్షలకు హాజరుకాగా, 30,654 మంది క్వాలిఫైఅ య్యారు. 96.12 శాతం ఉత్తీర్ణత సాధించారు.  క్వాలిఫై అయినవారిలో 25160 మంది పురుషులు, 6731 మంది మహిళలు ఉన్నారు.   (ఫలితాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

సబ్జెక్టుల వారీగా ర్యాంకర్లు వీరే

  •  అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ : గొర్తి వంశీకృష్ణ, (అనంతపురం )
  • బీఎస్సీ మేథమెటిక్స్ : శివాల శ్రీనివాసరావు (శ్రీకాకుళం)
  • సిరామిక్‌ టెక్నాలజీ: తూతిక సంతోష్ కుమార్ (ప్రకాశం జిల్లా)
  • కెమికల్‌ ఇంజనీరింగ్‌: ముస్తాక్‌ అహ్మద్‌ (గుంటూరు)
  • సివిల్‌ ఇంజనీరింగ్‌: బానోతు అంజలి (ఖమ్మం)
  • కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ : కోడి తేజ (కాకినాడ)
  • ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్: నరేష్ రెడ్డి ( కడప)
  • ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్: కుర్రా వైష్ణవి ( గుంటూరు జిల్లా రేపల్లే)
  • లక్ట్రానిక్స్ అండ్ ఇన్ట్రుమెంటెరషన్ ఇంజనీరింగ్ : ఫృద్వీ ( రంగారెడ్డి)
  •  మెకానికల్ ఇంజనీరింగ్ : గరగా అజయ్ ( విశాఖపట్టణం)
  • మెటలర్జికల్ ఇంజనీరింగ్ : వరుణ్ రాజు ( విజయనగరం)
  • మైనింగ్ ఇంజనీరింగ్ : బానాల వంశీకృష్ణ (ములుగు)
  • ఫార్మసీ: అశ్లేష్ కుమార్( కృష్ణా జిల్లా చల్లపల్లి),  శాంతి ( శ్రీకాళుళం జిల్లా మందస)
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top