సీఎం జగన్‌ అవనిగడ్డ పర్యటన.. అప్‌డేట్స్‌

AP CM YS Jagan to Visit Avanigadda to Distribute Clearance Documents To Farmers - Sakshi

సీఎం జగన్‌ అవనిగడ్డ పర్యటన.. అప్‌డేట్స్‌

12:50PM
నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్‌ పత్రాలను రైతులకు అందజేసే కార్యక్రమాన్ని కంప్యూటర్‌ బటన్‌ నొక్కి సీఎం జగన్‌ ప్రారంభించారు

12:08PM
సీఎం జగన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

  • స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా భూములకు కచ్చితమైన రికార్డులు లేవు
  • రికార్డుల్లో వివరాలు పక్కాగా లేకపోవడంతో ఇబ్బందులు
  • వంద ఏళ్ల తర్వాత మహాయజ్ఞంలా భూసర్వే చేస్తున్నాం
  • 15వేల మంది సర్వేయర్లను రిక్రూట్‌ చేశాం
  • అత్యాధునిక పరికరాలను  భూ సర్వేకు ఉపయోగిస్తున్నాం
  • విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను ఉపయోగిస్తున్నాం
  • భూముల రీసర్వేతో రికార్టులను అప్‌డేట్‌ చేస్తున్నాం
  • చుక్కల భూములని, అనాధీన భూములని ఇటువంటి నిషేధిత జాబితాలో ఉన్న భూములకు పరిష్కారం చేశాం
  • రైతులకు ఏ సమస్య ఉండకూడదని గత ప్రభుత్వాలు ఆలోచించలేదు
  • భూముల, స్థిరాస్తుల యాజమానులకు హక్కు పత్రాలు ఇవ్వబోతున్నాం
  • నవంబర్‌లో 1500లకు పైగా గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తాం
  • హద్దులు సరిచేసి హక్కు పత్రాలు అందజేస్తాం
  • సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం గ్రామాల్లోనే ఉండేలా అడుగులు వేస్తున్నాం
  • పేదవాడి బాగోగులను పట్టించుకునే ప్రభుత్వం మనది
  • మేనిఫెస్టోలో చెప్పిన 98 శాతం వాగ్దాలను నెరవేర్చాం
  • గ్రామాల రూపురేఖలు మారుస్తున్న ప్రభుత్వం మనది
  • వాలంటీర్‌ వ్యవస్థతో నేరుగా ఇంటికే సంక్షేమ పథకాలు
  • ఆర్బీకేల్లో విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు సేవలు
  • అవనిగడ్డ నియోజకవర్గంలో 15, 791 ఎకాలు, 10,019 మంది రైతన్నలకు ప్రయోజనం
  • రైతులకు అన్ని హక్కులు కల్పిస్తున్నాం 
  • గత ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేరుస్తూ 2016లో జీవో ఇచ్చింది
  • ఆ భూములను డీనోటిఫై చేసి రైతన్నలకు మేలు చేశాం
  • చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి రైతులకు మేలు చేశాం
  • రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలన్నింటికీ పరిష్కారం
  • దేశానికి ఆదర్శంగా ఉండేలా రిజిస్ట్రేషన్‌, రికార్డుల నిర్వహణ
  • మన పాలన, గత ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమనించాలి
  • వెన్నపోటు దారులంతా ఎవరికీ మంచి చేయలేదు
  • దుష్ట చతుష్టయం మన ప్రభుత్వంపై యుద్ధం చేస్తారట
  • ఒక్క జగన్‌ను కొట్టడానికి ఇంతమంది ఏకమవుతుంటే ఆశ్చర్యమేస్తోంది
  • ఇది మంచికి మోసానికి జరుగుతున్న యుద్ధం
  • పేదవానికి పెత్తందారులకు జరుగుతున్న యుద్ధం
  • మనం ఎవరికీ అన్యాయం చేయలేదు
  • మూడు రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుందని చెబితే..కాదు మూడు పెళ్లిళ్లు వల్లే మేలు జరుగుతుందని చెబుతున్నారు
  • మీరు చేసుకోండి.. అని ఏకంగా టీవీల్లో చెబుతున్నారు
  • అలా అందరూ మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటే వ్యవస్థ ఏం బతుకుతుంది
  • ఆడవాళ్ల మానప్రాణాలు, అక్కాచెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి?
  • ఇలాంటి నాయకులా మనకు దిశ దశ చూపేది?
  • దుష్టచతుష్టయంగా ఏర్పడి కలిసి కూటములు కడతారు
  • వాళ్ల మాదిరిగా నేను కుట్రలు, మీడియాను నమ్ముకోలేదు
  • నేను దేవుడిని నమ్ముకున్నా.. అక్కా చెల్లెమ్మలను నమ్ముకున్నా

11:51AM
మంత్రి ధర్మాన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

  • 35 వేల ఎకరాలు రైతులదేనని సీఎం జగన్‌ చెప్పారు
  • భూములపై సీఎం జగన్‌ అన్ని హక్కులు కల్పించారు
  • భూమి రైతన్నకు ఒక సెంటిమెంట్‌
  • రైతన్నకు ఒక హోదాను సీఎం జగన్‌ కల్పించారు
  • 35 వేల ఎకరాలను గడిచిన ప్రభుత్వం సర్కారు భూమి అని పెట్టింది
  • ప్రభుత్వ భూమి కాదు.. 90 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతాంగానిదే భూమి అని సీఎం జగన్‌ ఆర్డర్‌ ఇచ్చారు
  • గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించాలి
  • రిజిస్ట్రేషన్‌ వ్యవస్థలో పెద్ద మార్పులు తీసుకొస్తాం
     

11:30

అవనిగడ్డ సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్‌

10:51AM
అవనిగడ్డకు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌
హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికిన మంత్రులు ధర్మాన, రోజా,  జోగి రమేష్, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, అధికారులు

10:00AM
గురువారం అవనిగడ్డ పర్యటనలో భాగంగా.. గుంటూరులోని తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు సీఎం జగన్‌. 

► అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జరిగే రైతులకు భూపత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 

► కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సాగనుంది. 22 ఏ (1) కింద ఉన్న నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్‌ పత్రాలను రైతులకు సీఎం జగన్‌ అందజేస్తారు. అనంతరం అక్కడి బహిరంగ సభలో పాల్గొంటారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top