సాహితీవేత్త ఆచార్య ర‌వ్వా శ్రీహ‌రి కన్నుమూతపై ఏపీ సీఎం జగన్‌ సంతాపం

AP CM YS Jagan Condolence To Acharya Ravva Srihari - Sakshi

సాక్షి, గుంటూరు: ప్రముఖ సాహితీవేత్త‌ ఆచార్య ర‌వ్వా శ్రీహ‌రి(80) ఇక లేరు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయన శుక్రవారం రాత్రి గుండెపోటుతో క‌న్నుమూశారు.  ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. 

తెలుగు, సంస్కృత భాషల్లో పండితుడు, సాహితీవేత్త అయిన రవ్వా శ్రీహరి మృతిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలియజేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు సీఎం జగన్‌. 

మరోవైపు ర‌వ్వా శ్రీహ‌రి మృతిప‌ట్ల ప‌లువురు సాహితీవేత్త‌లు, ర‌చ‌యిత‌లు సంతాపం ప్ర‌క‌టించారు. ఆయ‌న మ‌ర‌ణం సంస్కృతాంధ్ర భాష‌ల‌కు తీర‌ని లోటు అని సాహితీవేత్త‌లు పేర్కొన్నారు. కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ తెలుగు శాఖ పూర్వ అధ్య‌క్షులు, ద్రావిడ యూనివ‌ర్సిటీ వీసీగా పని చేశారు ఆచార్య రవ్వా శ్రీహరి. టీటీడీలోనూ ఆయన కొంతకాలం పని చేశారు. తెలంగాణ నల్లగొండ జిల్లా వెల్వర్తిలో ఒక సామాన్య చేనేత కుటుంబంలో జన్మించారు శ్రీహరి. 2011లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి ఎడిటర్-ఇన్-ఛార్జ్‌గా పనిచేశాడు. హైదరాబాద్‌ మలకపేట యశోద ఆసుపత్రి ఎదురుగా వున్న జడ్జెస్ కాలనీలోని రుక్మిణి అపార్టుమెంట్‌లో ఆయన నివాసం ఉంది. ఆదివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top