
Jagananna Amma Vodi Srikakulam Tour Updates
12: 54PM
అమ్మ ఒడి మూడో విడత నిధులను విడుదల చేసిన సీఎం జగన్
కంప్యూటర్ బటన్ నొక్కి రూ. 6,595 కోట్లు జమ చేసిన సీఎం జగన్
విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన సీఎం జగన్
12:05 PM
చదువే నిజమైన ఆస్తి అని సీఎం జగన్ స్పష్టం చేశారు. మనిషి తలరాతను మార్చగలిగే శక్తి చదువుకు మాత్రమే ఉందని, చదువుపై పెట్టే ప్రతి రూపాయి కూడా పిల్లల తలరాతలు మారుస్తుందని సీఎం జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. చదువులు ఎక్కువగా ఉండే దేశాల్లో ఆదాయం ఎక్కువగా ఉందన్నారు సీఎం జ.గన్. అమ్మఒడి మూడో విడతలో రూ. 6,595 కోట్లు జమ చేస్తున్నట్లు తెలిపారు. సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి తల్లి కష్టాన్ని చూశానని, అందుకే అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్నారు.
‘జగన్ మావయ్యా..’ అంటూ ఇంగ్లీష్‌లో..
► శ్రీకాకుళం ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న నిహారిక.. సీఎం జగన్‌ను మావయ్యా అని సంబోధిస్తూ.. అమ్మఒడి కార్యక్రమంలో ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడింది. అమ్మ ఒడితో పాటు పలుసంక్షేమ పథకాల ద్వారా తనలాంటి లక్షల మంది పిల్లలకు.. తల్లిదండ్రులకు చేకూరుతున్న లబ్ది గురించి చక్కగా వివరించింది ఆ చిన్నారి. చివర్లో..
‘జగన్ మావయ్యా.. మీరు రాజన్నకి పుత్రుడు
రైతన్నకి మిత్రుడు
అక్కాచెల్లెలమ్మకు అన్నదమ్ముడు
మాలాంటి పిల్లలకు విద్యాదేవుడు’.. అంటూ సీఎం జగన్ నుంచి ఆశీర్వాదం తీసుకుంది. ఆంగ్లంలో అనర్గళంగా ప్రసంగించిన ఆ చిన్నారి ప్రతిభను చూసి సీఎం జగన్ మురిసిపోయారు.
►11.48AM
అమ్మఒడి కార్యక్రమం ఓ అద్భుతం. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలన్నదే సీఎం జగన్ ఆశయం. గతంలో ఎన్నడూ విద్య కోసం ఇంత పెద్దఎత్తున ఖర్చు చేయలేదు. విద్య, ఆరోగ్యానికి సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారు. విద్యార్థులంతా మంచి చదువులు చదువుకోవాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు. ప్రతీ సంక్షేమ పథకం వెనుక దీర్ఘకాలమైన ఆలోచన ఉంది. అమ్మఒడిపై విపక్షాలు, ఎల్లోమీడియా విషప్రచారం చేస్తున్నాయి. అయితే.. వాస్తవాలేంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు: మంత్రి బొత్స
►11.40AM
అమ్మఒడి పథకాన్ని దూరదృష్టితో సీఎం జగన్ ప్రవేశపెట్టారు. గత పాలకులు విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదు. రాష్ట్రంలో విద్యన్ ఆయన ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. తన బిడ్డల్లాగే అందరూ చదువుకోవాలన్నది సీఎం జగన్ ఆశయం. పేద పిల్లలు కూడా ఉన్నత విద్య చదవాలన్నది ఆయన తపన అని మంత్రి ధర్మాన ప్రసంగించారు. ఇదే వేదిక నుంచి ప్రతిపక్షాలకు అసత్య ప్రచారం మానుకోవాలని పిలుపు ఇచ్చారాయన.
11.35AM
► స్థానిక శాసన సభ్యులు, రెవెన్యూ మంత్రి శ్రీ ధర్మాన ప్రసాదరావు సభాక్షతన ప్రారంభమైన అమ్మఒడి మూడో విడుత నిధుల విడుదల కార్యక్రమ సభ.
► జగనన్న అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా.. వేదికపైకి చేరుకున్న సీఎం జగన్. దివంగత మహానేత వైఎస్సార్‌కు నివాళి.. జ్యోతి ప్రజల్వన అనంతరం నేతలతో ఆప్యాయ పలకరింపు.
► అమ్మ ఒడి కార్యక్రమం సభా వేదిక వద్ద విద్యార్థులు, తల్లులతో సీఎం జగన్ ఆప్యాయ పలకరింపు. వాళ్లతో ఫొటో దిగిన సీఎం జగన్.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
► అమ్మ ఒడి మూడవ విడత కార్యక్రమం సందర్భంగా.. విద్యార్థులు, తల్లిదండ్రుల ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మ ఒడితో.. రాష్ట్రంలో ఎక్కువగా పేద విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. చిన్న చిన్న పనులు చేసుకునే తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా.. వాళ్లకు సీఎం జగన్ ప్రభుత్వం భరోసా ఇస్తోంది. శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం వద్ద కాసేపట్లో సీఎం జగన్ ప్రసంగించి.. నిధులు విడుదల చేయనున్నారు.
10.56AM
► శ్రీకాకుళం చేరుకున్న సీఎం వైఎస్ జగన్. మరికాసేపట్లో జగనన్న అమ్మ ఒడి మూడో విడుత నగదు విడుదల.
10.35AM
► విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి శ్రీకాకుళం బయల్దేరిన సీఎం జగన్. శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో జగనన్న అమ్మ ఒడి మూడో విడత నగదు రిలీజ్ కార్యక్రమం.
ఆనందంగా బడికి పంపుతున్నారు
► అమ్మ ఒడి మూడో విడత కార్యక్రమం నేపథ్యంలో.. శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం వద్ద కోలాహలం నెలకొంది. సీఎం జగన్ తెచ్చిన ఈ పథకం వల్ల ఎందరో పేద తల్లిదండ్రులు.. తమ తమ పిల్లలను ఆనందంగా బడికి పంపుతున్నారు. ఈ విషయాన్నే కొందరు విద్యార్థులు సాక్షికి తెలియజేశారు. ‘‘మా నాన్నగారు ఒక రైతు. ప్రభుత్వ కాలేజీలోనే చదివిస్తున్నారంటూ ఓ విద్యార్థిని చెప్పగా.. తన తండ్రి తాపీ మేస్త్రీ అని, పల్లెటూరి నుంచి వచ్చిన తనకు తండ్రిపై ఆర్థిక భారం లేకుండా అమ్మ ఒడి సాయం చేస్తోందని మరో విద్యార్థిని తెలిపింది.
8.35 AM
► జగనన్న అమ్మ ఒడి పథకం కోసం.. శ్రీకాకుళం పర్యటనకు బయల్దేరారు సీఎం వైఎస్ జగన్.
► తాజాగా ఇచ్చే సొమ్ముతో కలిపి ఇప్పటివరకు జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా ప్రభుత్వం మొత్తం దాదాపు రూ.19,618 కోట్లు అందించినట్లు కానుంది.
► జగనన్న అమ్మ ఒడి పథకాన్ని వరుసగా మూడో ఏడాది (2021–22 విద్యా సంవత్సరానికి) అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.
► ఒకటి తరగతి నుంచి ఇంటర్ దాకా చదువుతున్న 82,31,502 మంది విద్యార్ధులకు అమ్మ ఒడితో లబ్ధి చేకూరుతుంది.
► 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో.. రూ.6,595 కోట్లను సీఎం జగన్, సోమవారం శ్రీకాకుళంలో నిర్వహించే కార్యక్రమంలో జమ చేయనున్నారు.
► అమ్మ ఒడి ద్వారా 2019 –20లో రాష్ట్ర ప్రభుత్వం 42,33,098 మంది తల్లులకు రూ.6,349.53 కోట్లు అందించింది. 2020– 21లో 44,48,865 మందికి రూ.6,673 కోట్లకుపై సాయంగా ఖాతాల్లో జమ చేసింది.
► సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం 11 గంటల ప్రాంతంలో.. శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అమ్మ ఒడి పథకం లబ్ధిదారులతో ముఖాముఖి అనంతరం సీఎం జగన్ ప్రసంగిస్తారు. కార్యక్రమం తర్వాత బయలుదేరి.. తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.