AP Budget 2021: 2 లక్షల 29 వేల కోట్లతో సంక్షేమ బడ్జెట్‌

AP Budget 2021: Minister Buggana Rajendra Prasad Presents Budget - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ ఒకరోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీలో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్‌ అంచనా రూ.2,29,779.27 కోట్లుగా తెలిపారు. ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. బీసీ ఉప ప్రణాళికకు రూ.28,237 కోట్లు, కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు, ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు, ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు బడ్జెట్‌లో వెచ్చించారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టున్నారు. సభ ప్రారంభం కాగానే పలువురు మాజీ ఎమ్మెల్యేల మృతిపట్ల అసెంబ్లీ సంతాపం తెలిపింది.

బడ్జెట్‌ కేటాయింపులు ఇలా..

బీసీ ఉప ప్రణాళిక: రూ.28,237 కోట్లు
ఎస్సీ ఉప ప్రణాళిక: రూ.17,403 కోట్లు
ఎస్టీ ఉప ప్రణాళిక: రూ.6,131 కోట్లు
కాపు సంక్షేమం: రూ.3,306 కోట్లు
ఈబీసీ సంక్షేమం: రూ.5,478 కోట్లు
బ్రాహ్మణ సంక్షేమం: రూ.359 కోట్లు

మైనార్టీ యాక్షన్‌ ప్లాన్‌: రూ.1,756 కోట్లు
చిన్నారుల కోసం రూ.16,748 కోట్లు
మహిళల అభివృద్ధి: రూ.47,283.21 కోట్లు
వ్యవసాయ పథకాలు: రూ.11,210 కోట్లు
విద్యా పథకాలు: రూ.24,624 కోట్లు
వైద్యం, ఆరోగ్యం: రూ.13,830 కోట్లు

వైఎస్సార్‌ పింఛన్‌ కానుక: రూ.17 వేల కోట్లు
వైఎస్సార్‌ రైతు భరోసా: రూ.3,845 కోట్లు
జగనన్న విద్యా దీవెన: రూ.2,500 కోట్లు
జగనన్న వసతి దీవెన: రూ.2,223.15 కోట్లు
వైఎస్సార్‌-పీఎం ఫసల్‌ బీమా: రూ.1802 కోట్లు
డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులు: రూ.865 కోట్లు
పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలు: రూ.247 కోట్లు

రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు: రూ.500 కోట్లు
వైఎస్సార్‌ కాపు నేస్తం: రూ.500 కోట్లు
వైఎస్సార్‌ జగనన్న చేదోడు: రూ.300 కోట్లు
వైఎస్సార్‌ వాహన మిత్ర: రూ.285 కోట్లు
వైఎస్సార్‌ నేతన్న నేస్తం: రూ.190 కోట్లు
వైఎస్సార్‌ మత్స్యకార భరోసా: రూ.120 కోట్లు
మత్స్యకారులకు డీజిల్‌ రాయితీ: రూ.50 కోట్లు
అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపులు: రూ.200 కోట్లు

రైతులకు నష్ట పరిహారం: రూ.20 కోట్లు
లా నేస్తం: రూ.16.64 కోట్లు
ఈబీసీ నేస్తం: రూ.500 కోట్లు
వైఎస్సార్‌ ఆసరా: రూ.6,337 కోట్లు
అమ్మఒడి: రూ.6,107 కోట్లు
వైఎస్సార్‌ చేయూత: రూ.4,455 కోట్లు
రైతు పథకాలు: రూ.11,210.80 కోట్లు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top