గతేడాది కన్నా రెట్టింపు కేటాయింపులు

AP Budget 2021: Allocations More Than Last Year - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్ద పీట వేసింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక కేటాయింపులు చేసింది. అసెంబ్లీ సమావేశంలో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. కొన్ని శాఖల వారీగా గతేడాది (2020-21) కేటాయింపులు.. ఈ ఏడాది కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి.

ఈబీసీ సంక్షేమం
8 శాతం అధిక కేటాయింపులు
ఈ ఏడాది (2020-21) రూ.5,478 కోట్లు
గతేడాది (2020-21) రూ.5,088.55 కోట్లు 

కాపు సంక్షేమం
2020-21లో రూ.3,090 కోట్లు
ఈ ఏడాది రూ.3,306 కోట్లు. మొత్తం 7 శాతం అధిక కేటాయింపులు

బ్రాహ్మణుల సంక్షేమం
2020-21లో రూ.124 కోట్లు
ఈ ఏడాది రూ.359 కోట్లు
189 శాతం అత్యధిక కేటాయింపులు

ఎస్సీ ఉప ప్రణాళిక
22 శాతం అధిక కేటాయింపులు చేశారు.
ఈ ఏడాది రూ.17,403 కోట్లు
గతేడాది రూ.14,218 కోట్లు

ఎస్టీ ఉప ప్రణాళిక
ఈ ఏడాది రూ.6,131 కోట్లు కేటాయింపు.. ఇది గత ఏడాది కంటే 27 శాతం అధిక కేటాయింపు
గతేడాది: రూ.4,814 కోట్లు

మైనార్టీ యాక్షన్‌ ప్లాన్‌తో పాటు మైనార్టీ ఉప ప్రణాళికలో కేటాయింపులు భారీగా పెంచారు.
మొత్తం 27 శాతం అధిక కేటాయింపులు ప్రభుత్వం చేసింది.
ఈ ఏడాది మొత్తం కేటాయింపులు రూ.3,840.72 కోట్లు
2020-21లో రూ.1,634 కోట్లు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top