45 ఏళ్లు దాటిన వారికే వ్యాక్సిన్‌

Anil Kumar Singhal Says That Corona cases decreasing from last three days - Sakshi

18 నుంచి 45 ఏళ్ల వారికి ఆ తర్వాతే 

నేటి నుంచి మూడు రోజులు కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ

తుపాన్‌ వేళ ఆక్సిజన్‌ సరఫరా పట్ల అప్రమత్తంగా ఉన్నాం

మూడు రోజులుగా కొద్ది కొద్దిగా తగ్గుతున్న కేసులు: సింఘాల్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలుత 45 ఏళ్లు నిండిన వారికి కోవిడ్‌ టీకాలు వేయడం పూర్తయ్యాకే 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల  వారికి ఇస్తామని, ఇది ప్రభుత్వ నిర్ణయమని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ స్పష్టం చేశారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయని చెప్పారు. నేటి నుంచి కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను 3 రోజుల పాటు వేయనున్నామన్నారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పరిధిలో కాకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ ఉంటే ఇష్టారాజ్యంగా ఎక్కువ రేట్లు వసూలు చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సీఎం కేంద్రానికి లేఖ రాశారన్నారు. కొన్ని గ్రూపులు అంటే రైల్వే, ఆర్టీసీ, పోర్ట్‌లు, బ్యాంకులు, సివిల్‌ సప్లై, పాత్రికేయులు వంటి విభాగాల్లో ఉన్న వారికి వ్యాక్సిన్‌ వేయాలని చెప్పామన్నారు. సింఘాల్‌ ఇంకా ఏమన్నారంటే..

► తుపాన్‌ ప్రభావం కారణంగా ఆక్సిజన్‌ సరఫరాలో ఇబ్బంది ఎదురవ్వకుండా అప్రమత్తంగా ఉన్నాం. రూర్కెలా, జామ్‌నగర్‌ వంటి చోట్ల నుంచి 70 మెట్రిక్‌ టన్నుల చొప్పున సేకరించాం.  
► మూడు రోజులుగా టెస్టులు తగ్గించకున్నా కేసులు రోజుకు వెయ్యి లెక్కన తగ్గుతూ వస్తున్నాయి.  పడకల లభ్యత పెరిగింది. 104కు వచ్చే కాల్స్‌ తగ్గాయి. ఇవన్నీ చూస్తే కరోనా కాస్త నెమ్మదిస్తున్నట్టు తెలుస్తోంది. బ్లాక్‌ ఫంగస్‌ కేసుల కోసం వెయ్యి ఇంజక్షన్లు వచ్చాయి. మరిన్ని వస్తున్నాయి. ఫీవర్‌ సర్వే కొనసాగుతోంది. 
► కృష్ణపట్నం మందుపై ఆయుష్‌ విభాగం నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఆ మందులో హానికారక దినుసులేవీ లేవని చెప్పారు. ప్రతి ఊళ్లో సంప్రదాయ మందులు వాడుతుంటారు. వాటికి అనుమతులు అవసరం లేదు. అయితే ఈ మందును ఆయుర్వేద మందుగా గుర్తించాలంటే పరిశీలించాల్సి ఉంటుంది.
► రాష్ట్రంలో ఇప్పటి వరకు 78,78,604 మందికి వ్యాక్సిన్‌ వేశాం. 1.55 లక్షల డోసులు కోవాగ్జిన్, 11.58 లక్షల డోసులు కోవిషీల్డ్‌ను జిల్లాలకు పంపించాం. 23.38 లక్షల మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ పూర్తయింది. జూన్‌ 15 వరకు మన దగ్గర ఉన్నది, కేంద్రం ఇచ్చేది అంతా కలిపితే 28.56 లక్షల డోసులు అవుతుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

24-05-2021
May 24, 2021, 08:56 IST
కోవిడ్‌ బారిన పడిన తల్లి కోసం పరితపించాడు. ఆమెను కాపాడుకోగలిగాడు కానీ తను మాత్రం తుదిశ్వాస విడిచాడు..
24-05-2021
May 24, 2021, 08:55 IST
ఇంటికెళ్లగానే నా నాలుగేళ్ల కొడుకు, రెండున్నరేళ్ల పాప ఎదురుగా కనిపిస్తారు. భవిష్యత్తు గురించి చాలా భయంగా ఉంది.
24-05-2021
May 24, 2021, 08:42 IST
పేషెంట్‌ పరిస్థితి సీరియస్‌గా ఉంది.. చూడండి సార్‌
24-05-2021
May 24, 2021, 08:11 IST
న్యూయార్క్‌: భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని కరోనా బాధితులకు తమ వంతు సేవలందించేందుకు అమెరికాలోని వైద్యులు, వృత్తి నిపుణులు ముందుకొస్తున్నారు. వారంతా...
24-05-2021
May 24, 2021, 08:04 IST
తడి వాహనాన్ని ఆపిన పోలీసులు గుర్తింపు కార్డు అడిగారు. అప్పుడు కానీ అతగాడు అసలు విషయం చెప్పలేదు. పోలీసుల నుంచి...
24-05-2021
May 24, 2021, 05:08 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా బాధితులకు ఉచితంగా సేవలందించేందుకు కాంగ్రెస్‌ పార్టీ మూడు అంబులెన్సులను ఏర్పాటు చేసింది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి...
24-05-2021
May 24, 2021, 05:02 IST
పొన్నూరు: కరోనా నుంచి కోలుకున్న పేషెంట్లకు తీవ్ర ముప్పుగా పరిణమించిన బ్లాక్‌ ఫంగస్‌ను ఆయుర్వేద చికిత్సతో పూర్తిగా నివారించవచ్చని ఆయుర్వేద...
24-05-2021
May 24, 2021, 04:56 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో.. సీబీఎస్‌ఈ క్లాస్‌ 12 పరీక్షల నిర్వహణపై జూన్‌ 1వ తేదీలోగా నిర్ణయం తీసుకుంటామని కేంద్రం...
24-05-2021
May 24, 2021, 04:35 IST
తిరుమల: కోవిడ్‌ బాధితులకు టీటీడీ అండగా నిలుస్తోంది. ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా అడుగులు వస్తోంది. కరోనా కోరల్లో చిక్కి ఆర్థిక...
24-05-2021
May 24, 2021, 04:19 IST
సాక్షి, అమరావతి: కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోపాటు దైవ సంకల్పం తోడుగా ఉండాలని దేవదాయ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా...
24-05-2021
May 24, 2021, 04:17 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా బారిన పడిన వెంటిలేటర్‌పై ఉన్న ఓ గర్భిణీకి మాతృత్వాన్ని ప్రసాదించడంతో పాటు, నెలలు నిండకముందే పుట్టి...
24-05-2021
May 24, 2021, 03:58 IST
సాక్షి, న్యూఢిల్లీ: శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే పీపీఈ కిట్లు ధరించి... కరోనా రోగులకు సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులను చూస్తున్నాం....
24-05-2021
May 24, 2021, 03:53 IST
నెల్లూరు (సెంట్రల్‌): కరోనా నివారణకు వన మూలికలతో తాను తయారు చేసే మందును ప్రభుత్వ అనుమతులు వచ్చాకే పంపిణీ చేస్తామని...
24-05-2021
May 24, 2021, 03:34 IST
న్యూఢిల్లీ: ఫార్మా రంగ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ కోవిడ్‌–19 చికిత్సకు నూతన విధానాలను అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించింది. కొన్ని...
24-05-2021
May 24, 2021, 03:26 IST
కరోనా రాక ముందు.. వచ్చిన తర్వాత.. ఇంటి బడ్జెట్, వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికల విషయంలో ఎక్కువ మంది అంగీకరించే మాట...
24-05-2021
May 24, 2021, 02:20 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా సెకండ్‌వేవ్‌ తరుణంలో ఇటీవల కొత్తగా వినిపిస్తున్న పేరు వైట్‌ ఫంగస్‌. కొద్దిరోజులుగా బ్లాక్‌ ఫంగస్‌ చేస్తున్న...
24-05-2021
May 24, 2021, 02:08 IST
సాక్షి, కాళేశ్వరం: బ్లాక్‌ ఫంగస్‌ ఓ రైతు కుటుంబాన్ని కకావికలం చేసింది. చికిత్స కోసం రూ.15 లక్షలు ఖర్చు చేయగా.. ప్రస్తుతం...
24-05-2021
May 24, 2021, 01:58 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న కరోనా వేరియంట్‌ కుటుంబంలో ఒక్కరికి సోకితే మిగతా సభ్యులందరికీ వేగంగా వ్యాప్తి చెందుతోంది....
24-05-2021
May 24, 2021, 01:42 IST
కరోనా బాధితుల్లో ప్రస్తుతం నీళ్ల విరేచనాలు సర్వ సాధారణంగా కనిపిస్తున్న లక్షణం. బాధితుల విసర్జితాల్లో వైరస్‌ ఆర్‌ఎన్‌ఏ లేదా జెనెటిక్‌...
24-05-2021
May 24, 2021, 00:56 IST
సాక్షి, హైదరాబాద్‌: బ్లాక్‌ఫంగస్‌ బాధితులకు చికిత్స జటిలమవుతోంది. రోజురోజుకు రాష్ట్రంలో ఈ ఫంగస్‌ బాధితులు పెరిగిపోతుండగా.. వారికి సరైన వైద్యం...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top